The Aero India 2025: 'ఏరో ఇండియా రూపంలో మరో మహాకుంభ్': రాజ్‌నాథ్ సింగ్
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూరులోని యలహంక వైమానిక కేంద్రంలో ఏరో ఇండియా 2025 ప్రదర్శన ప్రారంభమైంది.
ఈ ప్రదర్శన ఫిబ్రవరి 14వ తేదీ వరకు కొనసాగనుంది.
వివరాలు
వికాస్ భీ..విరాసత్ భీ
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.."భారతదేశంలో మహాకుంభ్ జరుగుతున్నది.అలాగే,ఏరో ఇండియా రూపంలో మరో మహాకుంభ్ ఇక్కడ ప్రారంభమైంది.ప్రయాగ్‌రాజ్‌లో జరిగేదిది ఆత్మపరిశీలన కోసం అయితే,బెంగళూరులో జరుగుతున్నది సృజనాత్మకత,పరిశీలన కొరకు.ప్రయాగ్‌రాజ్‌లో అంతర్గత సమైక్యత ప్రధాన లక్ష్యం అయితే,బెంగళూరులో జరిగే ఈకార్యక్రమం దేశ బాహ్య భద్రతకు ప్రాధాన్యత ఇస్తుంది.ఏరోఇండియా మహాకుంభ్‌లో భారత శక్తి ప్రత్యక్షంగా కనిపిస్తుంది.ప్రధాని మోదీ నినాదం'వికాస్ భీ..విరాసత్ భీ' అనే మాటలకు అనుగుణంగా ఈ ప్రదర్శన నిలుస్తుంది.గత ఏరో ఇండియా ప్రదర్శన నుంచి ఇప్పటి వరకు మేము అనేక విజయాలను సాధించాము.అస్త్ర క్షిపణి,నూతన తరహా ఆకాశ్ మిసైల్,అండర్ వాటర్ అటానమస్ వెహికల్,అన్‌మ్యాన్డ్ సర్ఫేస్ వెస్సల్ వంటి అధునాతన ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేశాము.భవిష్యత్తులో మరింత వేగంగా పురోగమిస్తాము"అని అన్నారు.
వివరాలు
బెంగళూరు - దేశ వైమానిక రాజధాని
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ, "దేశంలోని వైమానిక రంగానికి బెంగళూరు రాజధాని. సృజనాత్మకతను పెంపొందించేందుకు, ప్రపంచ స్థాయి భాగస్వామ్యాలను ఆకర్షించేందుకు కర్ణాటక ఎల్లప్పుడూ ముందుంటుంది. దేశ ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల పరిశోధనల్లో 60% వరకు బెంగళూరులోనే జరుగుతోంది. వాణిజ్య, రక్షణ విమానాశ్రయాలను నిర్వహించే ఏకైక నగరం బెంగళూరే" అని పేర్కొన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో భారీ ప్రదర్శన
ఈ ప్రదర్శనలో 27 దేశాల రక్షణ మంత్రులు, డిప్యూటీ మంత్రులు, 15 దేశాల రక్షణ, సేవారంగాల చీఫ్‌లు, 12 దేశాల రక్షణ శాఖ కార్యదర్శులు పాల్గొననున్నారు.
మొత్తం 80 దేశాల ప్రతినిధులు తమ రక్షణ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు.
వివరాలు
టికెట్ ధరలు
ఈ వేదికలో హెచ్‌ఏఎల్ (HAL), బోయింగ్ (Boeing), ఎయిర్‌బస్ (Airbus), ఇస్రో (ISRO), ఎన్‌ఏఎల్ (NAL), రోల్స్‌రాయిస్ (Rolls-Royce), ఎయిర్ ఇండియా, జీఈ ఏరోస్పేస్ (GE Aerospace), మహీంద్ర ఏరోస్పేస్ (Mahindra Aerospace) సంస్థలు తమ ఆధునిక ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి.
ఫిబ్రవరి 10-12 తేదీల్లో భారతీయుల బిజినెస్ పాస్-₹5,000 విదేశీయులకు- $150 ఈ పాస్‌లో ఎగ్జిబిషన్, ఎయిర్ డిస్‌ప్లే వ్యూయింగ్ ఏరియా (ADVA), కార్ పార్కింగ్ పాస్ ఉంటాయి. ఫిబ్రవరి 13-14 తేదీల్లో జనరల్ విజిటర్స్ పాస్ - ₹2,500 విదేశీయులకు - $50 కేవలం ఎయిర్ డిస్‌ప్లే వ్యూయింగ్ ఏరియా (ADVA) పాస్ భారతీయులకు - ₹1,000 విదేశీయులకు - $50 ఈ టికెట్లు ఫిబ్రవరి 11-14 మధ్య అందుబాటులో ఉంటాయి.
వివరాలు
సాంకేతికత అభివృద్ధిలో భారతదేశ స్థానం మరింత బలోపేతం
ఈ ఏడాది ఏరో ఇండియా 2025 ప్రదర్శన భారతదేశ వైమానిక రంగానికి కొత్త మైలురాయిగా నిలవనుంది.
ప్రపంచ వ్యాప్తంగా అత్యాధునిక టెక్నాలజీ, రక్షణ సామగ్రిని ప్రదర్శిస్తూ, సాంకేతికత అభివృద్ధిలో భారతదేశ స్థానాన్ని మరింత బలోపేతం చేయనున్నది.