
Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు..
ఈ వార్తాకథనం ఏంటి
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్‌పై పాకిస్థాన్ చేపట్టిన దాడులకు టర్కీ నుంచి సహాయం అందినట్లు సమాచారం.
ఈ దాడుల కోసం టర్కీ అధిక సంఖ్యలో డ్రోన్లను పంపించిందట. అంతే కాదు, ఆ డ్రోన్లను నియంత్రించేందుకు ఇద్దరు టర్కీ నిపుణులను కూడా పంపినట్లు సమాచార వర్గాలు వెల్లడించాయి.
ఈ ఘటనల నేపథ్యంలో భారత్‌లో టర్కీపై తీవ్ర వ్యతిరేకత ఉద్ధృతమవుతోంది.
ఇప్పటికే, పూణేకు చెందిన ఆపిల్ వ్యాపారులు తమ దుకాణాల్లో టర్కీ నుంచి దిగుమతి చేసుకున్న ఆపిల్స్ విక్రయాన్ని నిలిపివేశారు.
టర్కీ ఉత్పత్తులపై నిషేధానికి ఇది సంకేతంగా మారింది. ఇదే విధంగా, టర్కీకి పర్యటనకు వెళ్లాలని భావించిన అనేక మంది భారతీయులు తమ ట్రిప్‌లను రద్దు చేసుకుంటున్నారు.
వివరాలు
జామియా అధికారిక ప్రకటన
ఇక విద్యా రంగంలో కూడా టర్కీకి వ్యతిరేకంగా చర్యలు చేపట్టారు. గతంలో టర్కీ విద్యాసంస్థలతో ఒప్పందాలు చేసుకున్న భారత యూనివర్సిటీలు ఇప్పుడు వాటిని రద్దు చేస్తున్నాయి.
ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం టర్కీ విద్యా సంస్థలతో కుదుర్చుకున్న అన్ని అవగాహన ఒప్పందాలను (MoUs) రద్దు చేసినట్లు ప్రకటించింది.
"భారత ప్రభుత్వంతో సారధ్యం వహిస్తున్న దేశానికి మేము అండగా నిలుస్తున్నాం. అందువల్ల టర్కీకి చెందిన అన్ని విద్యా సంస్థలతో మా ఒప్పందాలను తక్షణమే నిలిపివేస్తున్నాం," అని జామియా ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది.
ఈ దిశగా హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం(MANUU)కూడా స్పందించింది.
టర్కీకి చెందిన యూనస్ ఎమ్రే ఇన్స్టిట్యూట్‌తో చేసుకున్న విద్యా ఒప్పందాన్ని(MoU)తక్షణమే రద్దు చేస్తున్నట్లు విశ్వవిద్యాలయం వెల్లడించింది.
వివరాలు
అజర్‌బైజాన్‌పైనా దేశవ్యాప్తంగా వ్యతిరేకత
ఇండో-పాక్ సంబంధాల్లో ఉద్రిక్తత పెరిగిన నేపథ్యంలో, పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు టర్కీ మద్దతు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
దీనికితోడు, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) కూడా ముందస్తు చర్యగా తుర్కియేలోని మలత్యలో ఉన్న ఇనోను విశ్వవిద్యాలయంతో కుదుర్చుకున్న విద్యా ఒప్పందాన్ని జాతీయ భద్రతా కారణాలతో నిలిపివేసింది.
ఈ పరిణామాల క్రమంలో, టర్కీతో పాటు పాకిస్తాన్‌కు మద్దతు తెలిపిన అజర్‌బైజాన్‌పైనా దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ప్రముఖ ట్రావెల్ బుకింగ్ వెబ్‌సైట్లైన మేక్ మై ట్రిప్, ఈజ్ మై ట్రిప్ వంటి సంస్థలు టర్కీ, అజర్‌బైజాన్‌లకు సంబంధించి ట్రావెల్ బుకింగ్‌ల రద్దు సంఖ్య భారీగా పెరిగిందని వెల్లడించాయి.
వివరాలు
టర్కీ నేరుగా మద్దతు ఇచ్చినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు టర్కీలో తయారైనవేనని వెల్లడైంది.
వాటిలో అసిస్‌గార్డ్ కంపెనీ తయారు చేసిన 'సోంగర్ కాంటాట్' మోడల్ డ్రోన్లు ముఖ్యంగా వినియోగించబడ్డాయి.
ఈ డ్రోన్లతో భారత్‌పై దాడులకు ప్రయత్నించడంలో టర్కీ నేరుగా మద్దతు ఇచ్చినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.