AP Free Gas Cylinders 2024 : ఏపీలోని మహిళలకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక..ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు- అర్హతలివే!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపావళి సందర్భంగా 'దీపం పథకం'ని ప్రవేశపెడుతుంది. ఈ పథకం ద్వారా మహిళలకు ప్రతి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించనున్నారు.
అక్టోబర్ 24 నుండి ఈ సిలిండర్ల బుకింగ్ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.
పీఎం ఉజ్వల యోజన కింద లబ్దిదారుల కోసం ఈ స్కీమ్ ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయబడతాయి.
వివరాలు
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం పై కీలక ప్రకటన
ఏపీ ప్రభుత్వం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని దీపావళి నుండి అమలు చేయనున్నట్టు ప్రకటించింది.
ఈ పథకం పై సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్, పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు, చమురు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, మహిళల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
దీపం పథకం ఏపీ చరిత్రలో గొప్ప మైలురాయిగా నిలుస్తుందని ఆయన తెలిపారు.
ఆడపడుచులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించాలనే నిర్ణయమైందని చెప్పారు.
వివరాలు
సంక్షేమ పథకాలకు అంకితభావం
ఆర్థిక ఇబ్బందుల ఉన్నప్పటికీ, సంక్షేమ పథకాల అమలులో వెనక్కి తగ్గకూడదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
అర్హులైన కుటుంబాలకు ప్రతి 4 నెలల వ్యవధిలో 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తామన్నారు.
రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్న ప్రతి అర్హ కుటుంబానికి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించాలని ఆయన చెప్పారు.
వివరాలు
బుకింగ్ వివరాలు
ఈ పథకం అక్టోబర్ 31 నుంచి ప్రారంభమవుతుంది, అయితే అక్టోబర్ 24 నుంచే సిలిండర్ల బుకింగ్ చేసుకోవచ్చు.
లబ్దిదారులు ముందుగా నగదు చెల్లించి గ్యాస్ సిలిండర్ పొందాలి. 2 రోజుల వ్యవధిలో, లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీ జమ చేయబడుతుంది.
మహిళలకు ఇంటి ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా గతంలో దీపం పథకం తీసుకువచ్చినట్టు చెప్పారు, ఇప్పుడు మళ్లీ ఉచిత సిలిండర్ల పథకం అమలులోకి వస్తుందని వివరించారు.
వివరాలు
అర్హతలు,అవసరమైన పత్రాలు
దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందాలంటే కొన్ని అర్హతలు ఉండాలి:
లబ్దిదారులు ఆంధ్రప్రదేశ్ పౌరులు కావాలి.
తెల్ల రేషన్ కార్డు ఉండాలి. గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండాలి.
బీపీఎల్ కుటుంబాలు మాత్రమే అర్హతగలవారు.
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన పత్రాలు:
ఆధార్ కార్డు
తెల్ల రేషన్ కార్డు
మొబైల్ నంబర్
కరెంట్ బిల్లు
స్థానికత సర్టిఫికెట్
దీపం పథకం కింద మూడు సిలిండర్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అధికారులు సూచించిన విధంగా లబ్దిదారుల పేరు, చిరునామా నమోదు చేయాలి.
ఇతర డాక్యుమెంట్ల ఫొటోలు ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయాలి. దరఖాస్తుదారులు వివరాలను పరిశీలించి, అర్హులకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తారు.