Page Loader
చంద్రబాబుకు హైకోర్టులో చుక్కెదురు.. క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం
క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేసిన ఉన్నత న్యాయస్థానం

చంద్రబాబుకు హైకోర్టులో చుక్కెదురు.. క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 22, 2023
02:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో చుక్కెదురైంది. స్కిల్‌ డెవలప్‌మెంట్ కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు, ఇటీవలే అరెస్టయ్యారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌, దాని ఆధారంగా ఏసీబీ కోర్టు జారీ చేసిన రిమాండ్‌ ఉత్తర్వులను చంద్రబాబు సవాల్ చేశారు. ఈ మేరకు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈనెల 19న ఈ పిటిషన్‌పై చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు లాయర్లు హరీశ్‌ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, చంద్రబాబు అభ్యర్థనను తొసిపుచ్చుతూ ఇవాళ తీర్పు వెలువరించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చంద్రబాబు పిటిషన్‌ను తోసిపుచ్చిన హైకోర్టు