
Noida Day Care: నోయిడాలో అమానుష ఘటన.. నేలపై పడేసి..గోడకేసి కొట్టి..చిన్నారి పట్ల డేకేర్ సిబ్బంది దారుణం.. వీడియో ఇదిగో!
ఈ వార్తాకథనం ఏంటి
పట్టణాల్లో ఉద్యోగాల కోసం వెళ్లే దంపతులు,ఇష్టం లేకపోయినా వేరే మార్గం లేక తమ చిన్నారులను డే కేర్ సెంటర్లకు అప్పగించాల్సి వస్తుంది. అలాంటి ప్రదేశాల్లో చిన్నపిల్లలను స్నేహపూర్వకంగా చూసుకోవాల్సిన సిబ్బంది, ఒక పసిపాప పట్ల అమానుషంగా ప్రవర్తించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. స్థానిక మీడియా సమాచారం ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా ప్రాంతానికి చెందిన ఒక దంపతులు, తమ 15 నెలల కుమార్తెను సమీపంలోని ఒక డే కేర్ సెంటర్‌లో వదిలి ఉద్యోగాలకు వెళ్ళడం అలవాటు చేసుకున్నారు. ఇటీవల చిన్నారిని ఇంటికి తీసుకొచ్చి, దుస్తులు మార్చే సమయంలో,ఆమె శరీరంపై పలు చోట్ల గాయాల మచ్చలు, అలాగే కొరకిన గుర్తులు ఉన్నట్టు గుర్తించారు.
వివరాలు
సీసీటీవీ ఫుటేజీలో కిందపడేసి, గోడకేసి, ప్లాస్టిక్ బ్యాట్‌తో కొడుతున్న దృశ్యాలు
దీంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు డే కేర్ సెంటర్‌కు వెళ్లి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అందులో,అక్కడ ఆయాగా పని చేసే ఒక యువతి,పాప ఏడుస్తున్నా పట్టించుకోకుండా,ఆమెను కిందపడేసి, గోడకేసి, ప్లాస్టిక్ బ్యాట్‌తో కొడుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. బాధితుల ఆరోపణల ప్రకారం ..ఈ విషయాన్ని డే కేర్ సెంటర్ యాజమాన్యం తెలిసినా,చిన్నారిని రక్షించే చర్యలు తీసుకోలేదని,అంతేకాక ప్రశ్నించినందుకు తమపై దుర్భాషలాడారని ఆరోపిస్తూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
వివరాలు
ఇలా అమానుషంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు,వీడియోలో ఉన్న సాక్ష్యాల ప్రకారం కేసు నమోదు చేసి, అక్కడ పనిచేసే యువతిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ కావడంతో,నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డే కేర్ సెంటర్లలో పిల్లలపై ఇలా అమానుషంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న డే కేర్ సెంటర్ సీసీటీవీ ఫుటేజ్
#Noida DAY CARE HORROR: A 15-month-old child was beaten, head smashed against a wall, dropped on the ground and bitten.
— Karan Singh (@Journo_Karan) August 11, 2025
Every working parent's worst nightmare! pic.twitter.com/KttIyyL0g3