NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bharat Bandh: నేడు భారత్ బంద్.. కొనసాగుతున్న రైతుల ఆందోళనలు 
    తదుపరి వార్తా కథనం
    Bharat Bandh: నేడు భారత్ బంద్.. కొనసాగుతున్న రైతుల ఆందోళనలు 
    Bharat Bandh: నేడు భారత్ బంద్.. కొనసాగుతున్న రైతుల ఆందోళనలు

    Bharat Bandh: నేడు భారత్ బంద్.. కొనసాగుతున్న రైతుల ఆందోళనలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 16, 2024
    09:12 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సంయుక్త కిసాన్ మోర్చా,కేంద్ర కార్మిక సంఘాలు నేడు గ్రామీణ భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి.

    ఇప్పటికే ఉదయం 6 గంటలకు ప్రారంభమైన 'భారత్ బంద్' సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది.

    నిరసన తెలుపుతున్న రైతులు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రధాన భారతీయ రహదారులపై భారీ 'చక్కా జామ్'లో పాల్గొంటారు.

    అత్యవసర సేవలకు ఇందులో మినహాయింపు ఉంటుంది. సెక్షన్ 144 విధించినందున దిల్లీ, దాని దేశ రాజధాని ప్రాంతం (NCR) లో పెద్ద సమావేశాలు నిషేధించబడ్డాయి.

    నోయిడాకు చెందిన భారతీయ కిసాన్ పరిషత్ దేశవ్యాప్త సమ్మెకు మద్దతు ఇవ్వడంతో ఆందోళనను తీవ్రతరం చేస్తామని రైతులు ప్రతిజ్ఞ చేశారు.

    Details 

    ఆదివారం మరోసారి చర్చలు 

    నిరసన తెలుపుతున్న రైతు సంఘాల నేతలు, ముగ్గురు కేంద్ర మంత్రుల మధ్య ఐదు గంటలపాటు జరిగిన మారథాన్ చర్చ గురువారం ఎలాంటి పురోగతి సాధించలేదు.

    ఆదివారం (ఫిబ్రవరి 18) మరో రౌండ్ చర్చ జరగనుంది.

    ఢిల్లీ, పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో మోహరించిన పారామిలటరీ బలగాలు ఆందోళన చేస్తున్న రైతులను రెచ్చగొడుతున్నాయని గురువారం కేంద్రంతో తమ చర్చల సందర్భంగా రైతులు అన్నారు.

    చర్చానంతరం 'ఇండియా టుడే'తో రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లెవాల్ మాట్లాడుతూ, ''మేము పాకిస్థానీలం కాదు. పరిష్కారం లభిస్తుందని రైతులు ఆశిస్తున్నారని, వారి ఆందోళన మరింత ఉధృతం అవుతుందని, వారు ఇంకా "ఢిల్లీకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు" అని ఆయన అన్నారు.

    Details 

     రైతులకు సంఘీభావం తెలిపిన పంజాబ్ సీఎం 

    పంజాబ్ ముఖ్యమంత్రి, AAP నాయకుడు భగవంత్ మాన్ నిరసన తెలిపిన రైతులకు సంఘీభావం తెలిపారు.

    హర్యానాతో రాష్ట్ర సరిహద్దుల్లో డ్రోన్లను ఉపయోగించడం, ముళ్ల కంచెలు వేయడంపై విమర్శలు చేశారు.

    అటువంటి ప్రవర్తనను "సవతి-తల్లిప్రేమ" అని పిలిచిన ఆయన, మూడు హర్యానా జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడాన్ని కూడా విమర్శించారు.

    కేంద్రం, రైతు సంఘాల మధ్య గురువారం జరిగిన మూడో దఫా చర్చలు అర్థరాత్రి వరకు సాగాయి.

    రైతుల 'ఢిల్లీ చలో' ఆందోళన మంగళవారం (ఫిబ్రవరి 13) ప్రారంభం కావడానికి ముందు ఫిబ్రవరి 8,12 తేదీల్లో రెండు రౌండ్ల చర్చలు జరిగాయి. అయితే, రెండూ విఫలమయ్యాయి.

    Details 

    రైతులపై టియర్ గ్యాస్ ,వాటర్ ఫిరంగులు 

    పంజాబ్ నుండి రైతులు ఫిబ్రవరి 13న దేశ రాజధానికి తమ మార్చ్‌ను ప్రారంభించారు.

    అయితే దిల్లీ,హర్యానా మధ్య శంభు, ఖనౌరీ సరిహద్దుల వద్ద భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు.

    అప్పటి నుంచి నిరసన తెలుపుతున్న రైతులు ఈ సరిహద్దు పాయింట్ల వద్దే మకాం వేశారు.

    ఉత్తర్‌ప్రదేశ్, హర్యానా నుండి నిరసన తెలుపుతున్న రైతులు మంగళవారం ఢిల్లీకి తమ పాదయాత్రను ప్రారంభించారు.

    ఫిబ్రవరి 13న శంభు, ఖనౌరీ సరిహద్దుల వద్ద హర్యానా పోలీసులు నిరసన తెలుపుతున్న రైతులపై టియర్ గ్యాస్ షెల్లు,వాటర్ ఫిరంగులను ఉపయోగించారు.

    ప్రధానంగా పంజాబ్‌కు చెందిన రైతులు, బారికేడ్లను బద్దలు కొట్టేందుకు ప్రయత్నించడంతో రెండు సరిహద్దు పాయింట్ల వద్ద హర్యానా పోలీసులతో ఘర్షణ పడ్డారు.

    Details 

    144 కింద ఆంక్షలు

    దిల్లీ -ఎన్‌సీఆర్‌లో రైతుల ఆందోళనల మధ్య వాహనాల రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

    భారత్ బంద్ నేపథ్యంలో నోయిడా, గ్రేటర్ నోయిడాతో సహా జిల్లా అంతటా అనధికార బహిరంగ సభలపై నిషేధం సహా CrPC సెక్షన్ 144 కింద ఆంక్షలు విధించినట్లు గౌతం బుద్ధ్ నగర్ పోలీసులు గురువారం తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    దిల్లీ

    Cab driver stabbed: దిల్లీలో క్యాబ్ డ్రైవర్‌ హత్య.. ఓవర్‌టేక్ చేయడానికి దారిఇవ్వలేదని  భారతదేశం
    Blinkit's Condom order: వీడు మామూలోడు కాదు.. 2023లో ఏకంగా 10వేల కండోమ్‌లు వాడేశాడు జొమాటో
    Cm Kejriwal : కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు.. జైలుకు వెళ్లేందుకు రెడీగా ఉండాలని కార్యకర్తలకు సూచన  అరవింద్ కేజ్రీవాల్
    Delhi AIIMS Fire: ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్నిప్రమాదం..కాలిన ఫర్నిచర్,కార్యాలయ రికార్డులు అగ్నిప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025