Bomb Threat: చెన్నై-ముంబై ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
ఈ వార్తాకథనం ఏంటి
చెన్నై నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో విమానానికి మంగళవారం బాంబు బెదిరింపు సందేశం వచ్చింది.
సమాచారం అందుకున్న విమానం దాదాపు రాత్రి 10.30గంటలకు ముంబై విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది.
ఒక ప్రకటనలో, విమానయాన సంస్థ బాంబు బెదిరింపును ధృవీకరించింది. ప్రోటోకాల్‌ను అనుసరించి, ప్రయాణీకులందరినీ సురక్షితంగా దింపినట్లు తెలిపింది.
"చెన్నై నుండి ముంబైకి వెళుతున్న ఇండిగో ఫ్లైట్ 6E 5149కి బాంబు బెదిరింపు వచ్చింది.ముంబైలో ల్యాండ్ అయిన తర్వాత, సిబ్బంది ప్రోటోకాల్‌ను అనుసరించి విమానాన్ని ఐసోలేషన్ బేకు తీసుకెళ్లారు" అని ఎయిర్‌లైన్స్ తెలిపింది.
"ప్రయాణికులందరూ సురక్షితంగా విమానం నుండి దిగారు.మేము భద్రతా సంస్థలతో కలిసి పని చేస్తున్నాము.అన్ని భద్రతా తనిఖీలు పూర్తయిన తర్వాత, విమానం టెర్మినల్ కి వెళుతుందని " అని తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
Chennai-Mumbai IndiGo flight receives bomb threat, passengers safe: News agency ANI ADSChennai-Mumbai IndiGo flight receives bomb threat, passengers safe: News agency ANIThis is a... To read the full story visit… https://t.co/fVAZ4oyNUs
— Daily Update (@GauravK33075878) June 19, 2024