
Opertion Sindoor: ఆపరేషన్ సిందూర్ తర్వాత సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్ .. రాజస్థాన్‌లో పాకిస్థాన్ బోర్డర్ సీల్.. పంజాబ్‌లో హైఅలర్ట్..!
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌తో సరిహద్దులు పంచుకుంటున్న రాష్ట్రాల్లో భద్రతా చర్యలు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి.
రాజస్థాన్‌లో 1,037 కిలోమీటర్ల మేర ఉన్న పాకిస్థాన్ సరిహద్దును సీల్ చేశారు.
సరిహద్దుల వద్ద ఎవరైనా అనుమానాస్పదంగా వ్యవహరిస్తే వారిని కాల్చివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
భారత వాయుసేన కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉంది. మే 9వ తేదీ వరకు జోధ్‌పుర్, బికనేర్, కిషన్‌ఘర్ విమానాశ్రయాలు మూసివేశారు.
గగనతలంలో యుద్ధవిమానాల గస్తీ నిర్వహిస్తున్నారు. ఇక్కడ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలను యాక్టివేట్ చేశారు.
వివరాలు
పాకిస్థాన్ కాల్పులలో జవాన్‌తో సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు
పంజాబ్‌లో కూడా ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. సరిహద్దు ప్రాంతాల్లోని ఆరు జిల్లాల్లో పాఠశాలలను మూసివేశారు.
వీటిలో ఫిరోజ్‌పుర్, పఠాన్‌కోట్, ఫజ్లికా, అమృత్సర్, గురుదాస్‌పుర్, తార్న్‌తరన్ ప్రాంతాలలో 72 గంటల పాటు స్కూళ్లు మూసివేశారు.
రాష్ట్ర పోలీస్‌శాఖ, ఇతర సిబ్బంది సెలవులను రద్దు చేసి తక్షణమే విధులకు హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చింది.
జమ్ముకశ్మీర్‌లోనూ పాకిస్థాన్ దళాలు శతఘ్ని గుండ్లను కాలుస్తున్నాయి. దీంతో మన సైన్యం కూడా తగిన విధంగా బదులిస్తోంది.
పాకిస్థాన్ సైన్యం పౌర నివాసాలను లక్ష్యంగా చేసి కాల్పులు జరుపుతోంది. ఈ కాల్పుల్లో ఒక జవాన్‌తో సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
వివరాలు
80 మంది ఉగ్రవాదులు హతం
మంగళవారం రాత్రి, అందరూ నిద్రపోతున్నప్పుడు పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై 'ఆపరేషన్ సిందూర్' పేరిట క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డారు.
సరిహద్దుకు ఆవల 100 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు.
80 మంది ఉగ్రవాదులను హతమార్చారు. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకున్నారు.