Page Loader
Atishi: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన.. దిల్లీ సీఎం అతిషి, ఆప్ కార్యకర్తలపై కేసు
ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన.. దిల్లీ సీఎం అతిషి, ఆప్ కార్యకర్తలపై కేసు

Atishi: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన.. దిల్లీ సీఎం అతిషి, ఆప్ కార్యకర్తలపై కేసు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 04, 2025
11:13 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ ముఖ్యమంత్రి అతిషి మార్లెనా (Atishi Marlena) పై ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె మద్దతుదారులపై కూడా మరో కేసు నమోదైంది. ఈ పరిణామాలపై ఆమె తీవ్రంగా స్పందిస్తూ, ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. సుమారు 60 మంది మద్దతుదారులతో కలసి, 10 వాహనాలలో ఆమె ఫతేహ్‌ సింగ్ మార్గ్‌కు చేరుకున్నారు. పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించినప్పటికీ, ఆమె తిరస్కరించడంతో ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదైంది. ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘనగా గుర్తించి, పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. అలాగే,అధికారుల విధులకు ఆటంకం కలిగించినట్లు ఆరోపణలు రావడంతో ఆమె మద్దతుదారులపై కూడా మరో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

వివరాలు 

అతిషి కౌంటర్‌ 

ఈఘటనపై అతిషి ఎక్స్‌ వేదికగా స్పందించారు.ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని,నిజంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఈసందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ పై ఆమె విమర్శలు గుప్పించారు. "ఎన్నికల సంఘం గణనీయంగా పని చేస్తోందట!రమేష్ బిధూరి కుటుంబ సభ్యులు బహిరంగంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా,వారిపై చర్యలు ఏమీ తీసుకోలేదు.నేను పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు ప్రతిగా నాపైనే కేసుపెట్టారు.రాజీవ్ కుమార్ గారూ,ఎన్నికల ప్రక్రియను ఇంకెంత దిగజారుస్తారు?"అంటూ విమర్శించారు. ఇదిలా ఉండగా,ఆప్ పార్టీ కన్వీనర్ సైతం ఇటీవల సీఈసీ రాజీవ్ కుమార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేపు ఢిల్లీలో అసెంబ్లీఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అతిషి చేసిన ట్వీట్