కావేరీ జలాల కోసం రాత్రంతా కర్ణాటక రైతుల నిరసనలు
తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయాలన్న ఆదేశాలను వ్యతిరేకిస్తూ కర్ణాటకలోని రైతులు రాత్రంతా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. శ్రీరంగపట్నం సమీపంలోని మండ్యలో ఈ నిరసన ప్రారంభమైంది. 15 రోజుల పాటు తమిళనాడుకు 5000 క్యూసెక్కుల నీటిని కర్ణాటక విడుదల చేయాలనే కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ సిఫార్సుపై వారి రైతులు అభ్యంతరం తెలుపుతున్నారు. కాంగ్రెస్‌కు మద్దతిస్తున్న స్వతంత్ర ఎమ్మెల్యే దర్శన్ పుట్టనయ్య రైతులకు మద్దతు ప్రకటించారు.కావేరీ జలాల సమస్యపై చర్చించేందుకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. నీటిని విడుదల చేసేలా కర్ణాటకను ఆదేశించాలంటూ తమిళనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో సాధారణ రుతుపవనాలు నమోదవుతున్నాయని, కర్ణాటక అఫిడవిట్ దాఖలు చేసింది.
కావేరి జలాల కోసం దశాబ్దాలుగా వివాదం
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యమాట్లాడుతూ.. తమిళనాడుకు నీళ్లు ఇవ్వలేమని, తమ రిజర్వాయర్లు ఖాళీ అయితే తాగునీటి ఎద్దడి ఏర్పడుతుందని, ఆలా అయితే తమ రాష్ట్రానికి ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోసం ఢిల్లీ పయనమవుతున్నశివకుమార్ 3 వేల క్యూసెక్కులకు మించి ఇవ్వలేమని చెబుతున్నారు. కావేరీ జలాల కోసం రెండు దక్షిణాది రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. 1990లో కేంద్రం కావేరీ జల వివాదాల ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది.