Page Loader
Chandrababu: ఆరోగ్య ఆంధ్ర దిశగా తొలి అడుగు.. కుప్పం ఆసుపత్రిలో డీఐఎన్‌సీకి శ్రీకారం
ఆరోగ్య ఆంధ్ర దిశగా తొలి అడుగు.. కుప్పం ఆసుపత్రిలో డీఐఎన్‌సీకి శ్రీకారం

Chandrababu: ఆరోగ్య ఆంధ్ర దిశగా తొలి అడుగు.. కుప్పం ఆసుపత్రిలో డీఐఎన్‌సీకి శ్రీకారం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 03, 2025
01:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆరోగ్య ఆంధ్ర ప్రాజెక్ట్‌ను విజయవంతం చేయడంలో భాగంగా, ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పం నుంచే తొలి అడుగులు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం, టాటా గ్రూప్‌ సంయుక్తంగా కుప్పం ప్రాంతీయ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డిజిటల్ నెర్వ్ సెంటర్ (డీఐఎన్‌సీ)ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటన నిర్వహిస్తున్నారు.

వివరాలు 

92 గ్రామీణ ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానం

ఈ డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా ప్రాంతీయ ఆసుపత్రిని 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు) 92 గ్రామీణ ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానం చేశారు. వ్యక్తుల ఆరోగ్య రికార్డుల ఆధారంగా నిరంతర వైద్య పర్యవేక్షణ అందించేందుకు ఈ కేంద్రం కీలకంగా నిలవనుంది. వర్చువల్ విధానంలో వైద్య నిపుణుల సేవలను రోగులకు చేరువ చేయడం ద్వారా మెరుగైన చికిత్సా సదుపాయాలు కల్పించనున్నారు. ప్రజారోగ్యానికి సంబంధించిన సమస్త సమాచారం ఒకే వేదికపై సమీకరించేలా డిజి నెర్వ్‌ను రూపొందించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కుప్పం ప్రభుత్వాసుపత్రిలో డీఐఎన్‌సీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు