Page Loader
Alla Ramakrishna Reddy: టిడిపి కార్యాలయంపై దాడి.. వైసిపి మాజీ ఎమ్మెల్యే ఆర్కే పై కేసు నమోదు..
టిడిపి కార్యాలయంపై దాడి.. వైసిపి మాజీ ఎమ్మెల్యే ఆర్కే పై కేసు నమోదు..

Alla Ramakrishna Reddy: టిడిపి కార్యాలయంపై దాడి.. వైసిపి మాజీ ఎమ్మెల్యే ఆర్కే పై కేసు నమోదు..

వ్రాసిన వారు Sirish Praharaju
May 27, 2025
04:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాజీ మంగళగిరి ఎమ్మెల్యే,వైఎస్సార్సీపీ నేత అయిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి (ఆర్కే)పై ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసు,2021లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం మీద జరిగిన దాడికి సంబంధించింది. సదరు దాడి ఘటనలో ఆయనను సీఐడీ అధికారులు 127వ నిందితుడిగా నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. 2021 అక్టోబర్ 19న,అప్పటి వైసీపీ ప్రభుత్వ కాలంలో మంగళగిరిలో ఉన్న టీడీపీ ప్రధాన కార్యాలయంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.

వివరాలు 

ఇదే కేసులో నందిగం సురేశ్‌ అరెస్టు

ఈ సంఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. తరువాత కాలంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత, నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది. అప్పటి నుంచి సీఐడీ అధికారులు దర్యాప్తును వేగంగా కొనసాగిస్తున్నారు. ఇదే కేసులో వైఎస్సార్సీపీ మాజీ లోక్‌సభ సభ్యుడు నందిగం సురేశ్‌ను ఇప్పటికే అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.