Page Loader
ఆ 5 నదుల అనుసంధానంతో ఏపీ సుభిక్షం: చంద్రబాబు
ఆ 5 నదుల అనుసంధానంతో ఏపీ సుభిక్షం

ఆ 5 నదుల అనుసంధానంతో ఏపీ సుభిక్షం: చంద్రబాబు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 06, 2023
07:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. 'సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి' కార్యక్రమంలో భాగంగా పలు ప్రాజెక్టులను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలోకి చంద్రబాబు ప్రవేశించారు. వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చాక సాగునీటి రంగంలో విధ్వంసానికి పాల్పడుతోందని ఆరోపిస్తున్న చంద్రబాబు ఈ మేరకు యుద్దభేరి కొనసాగిస్తున్నారు. సాగునీటి రంగానికి సంబంధించి పలు ప్రాజెక్టులపై చంద్రబాబు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ప్రజలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు నీటి కష్టాలు రాకుండా ఉండాలంటే ఐదు నదులను అనుసంధించాలన్నారు.

DETAILS

గోదావరి, కృష్ణా, పెన్నా, నాగావళి, వంశధారలను అనుసంధానించాలన్న చంద్రబాబు 

రాష్ట్రంలోనే ప్రధాన నదులైన గోదావరి, కృష్ణా, పెన్నా, నాగావళి, వంశధారలను అనుసంధానిస్తే నీటి సమస్యలు ఉండబోదని, రాష్ట్ర సుభిక్షంగా మారుతుందని చంద్రబాబు కుండబుద్దలు కొట్టారు. ఆయా నదుల నీటిని సద్వినియోగం చేసుకుంటే సిరులు పండుతాయన్నారు. సోమశిల, కండలేరు ప్రాజెక్టు పనులకు బిల్లులు చెల్లించక పనులు ఆపేశారన్నారు. ఈ నేపథ్యంలోనే సోమశిల డ్యామ్‌కు ప్రమాదం పొంచి ఉందన్నారు. గండిపాలెం కాలువల్లో పూడిక తీయకుండా, నిర్వహణపై నిర్లక్ష్యం ప్రదర్శించారన్నారు. పెద్దిరెడ్డి సాగర్‌ పనులకు బిల్లులు మంజూరు చేయలేదన్నారు. పెద్దిరెడ్డి సాగర్‌ రిజర్వాయర్‌, డీఎం ఛానల్‌(DM CHANNEL), డీఆర్‌ ఛానల్‌(DR CHANNEL), సోమశిల, కండలేరు వరదకాలువ పనులు పెండింగ్‌ బిల్లుల కారణంగా ఆగిపోయాయని ఆయన మండిపడ్డారు.