CM Revanth Reddy : తెలంగాణలోనే ఎస్సీ వర్గీకరణను మొదటగా అమలు చేస్తాం
ఈ వార్తాకథనం ఏంటి
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చి తీర్పును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు.
దేశంలోనే ఎస్సీ వర్గీకరణను తెలంగాణలోనే మొదట అమలు చేస్తామని అసెంబ్లీలో పేర్కొన్నారు.
ఇలాంటి సంచలన తీర్పును ఇచ్చిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలని, అవసరమైతే ఇప్పటికే ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో వర్గీకరణను అమలు చేసేలా ఆర్డినెన్స్ తెచ్చి, మాదిగ ఉపకులాలకు న్యాయం చేస్తామని చెప్పారు.
తాను ప్రతిపక్షంలో ఉండగా మాదిగ ఉపకులాల వర్గాల కోసం వాయిదా తీర్మానం ఇస్తే తనతో పాటు సంపత్ కుమార్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం బహిష్కరించిందని గుర్తు చేశారు.
Details
సుప్రీంకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ హర్షం
ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనంతో ఏడుగురితో ఆరుగురు న్యాయమూర్తులు స్పష్టమైన తీర్పునిచ్చారని పేర్కన్నారు.
దేశంలో అందరికంటే ముందుగా తెలంగాణలో ప్రభుత్వమే వర్గీకరణ చేస్తుందన్నారు.
మరోవైపు సుప్రీంకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు.
ఎస్సీ వర్గీకరణ వెంటనే చేపట్టాలని సెప్టెంబర్ 29న అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి, ఆ తీర్మానాన్ని కేసీఆర్ తీసుకెళ్లి ప్రధానిని కలిసి అందజేశారన్నారు.