Page Loader
Congress: దిల్లీలో కాంగ్రెస్ దారుణ ఓటమి.. ఖాతా కూడా తెరవలేకపోయిన హస్తం
దిల్లీలో కాంగ్రెస్ దారుణ ఓటమి.. ఖాతా కూడా తెరవలేకపోయిన హస్తం

Congress: దిల్లీలో కాంగ్రెస్ దారుణ ఓటమి.. ఖాతా కూడా తెరవలేకపోయిన హస్తం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 08, 2025
12:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ, కాంగ్రెస్‌ పార్టీ పని కంచికే అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇటీవల జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఓటమిని మూటగట్టుకున్న హస్తం పార్టీ, ఇప్పుడు దిల్లీలో కూడా కనీస స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్‌ ఖాతా కూడా తెరవలేదు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 41 స్థానాల్లో, ఆమ్‌ ఆద్మీ పార్టీ 29 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో కాంగ్రెస్‌ శిబిరంలో తీవ్ర నిరాశ నెలకొంది.

Details

అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి

ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కొంతవరకు పుంజుకుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 44 స్థానాలు, 2019లో 52 స్థానాలు మాత్రమే గెలిచిన హస్తం పార్టీ, 2024 ఎన్నికల్లో మాత్రం 99 సీట్లు సాధించి మళ్లీ పుంజుకుంటుందనే నమ్మకం కలిగించింది. రాజ్యాంగ పరిరక్షణ, రిజర్వేషన్లు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి అంశాలపై ఎన్డీయే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజల మద్దతు పొందడంలో కాంగ్రెస్‌ కొంత మేర విజయం సాధించిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అదే జోష్‌ను కొనసాగించలేకపోయింది.

Details

 హర్యానాలో ఘోర పరాజయం 

లోక్‌సభ ఎన్నికల తర్వాత హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నిరాశ ఎదురైంది. హస్తం పార్టీ గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగినా, బీజేపీ అనూహ్యంగా పుంజుకొని హ్యాట్రిక్‌ విజయాన్ని సాధించింది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు కాంగ్రెస్‌ మద్దతుగా కనిపించినా, చివరికి ఫలితాలు పార్టీ నాయకత్వానికి గట్టి ఎదురుదెబ్బ ఇచ్చాయి. మహారాష్ట్రలోనూ అదే పరిస్థితి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ ఘోర పరాజయం చవిచూసింది. మహా వికాస్‌ అఘాడి కూటమి (కాంగ్రెస్, శివసేన-ఉద్ధవ, ఎన్సీపీ-శరద్ పవార్) ఘోరంగా ఓడిపోయింది. బీజేపీ, శివసేన-ఎక్స్‌ (షిండే గ్రూప్), ఎన్సీపీ-అజిత్ పవార్ కూటమిగా ఏర్పడిన మహాయుతి భారీ విజయం సాధించింది.

Details

దిల్లీ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు డబుల్ షాక్

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా విఫలమైంది. మొత్తం 70 స్థానాల్లో ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోయింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వరుస ఓటములతో పార్టీ బలహీనంగా మారుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మంచి ఫలితాలు సాధించినా, అసెంబ్లీ ఎన్నికల్లో వరుస పరాజయాలు ఎదురవుతుండటంతో కాంగ్రెస్‌ పార్టీ కృషి వల్ల కాకుండా మిత్రపక్షాల మద్దతుతోనే ఆ విజయం సాధించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో పార్టీ బలహీనపడుతుండటంతో, భవిష్యత్తులో గెలుపొందేలా మళ్లీ పునర్నిర్మాణం అవసరమన్న సూచనలు వినిపిస్తున్నాయి.