Page Loader
Constitution Debate: నేటి నుంచి లోక్‌సభలో రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ 
నేటి నుంచి లోక్‌సభలో రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ

Constitution Debate: నేటి నుంచి లోక్‌సభలో రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 13, 2024
10:18 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత రాజ్యాంగం ఆమోదం పొందిన 75వ వసంతాన్ని జరుపుకుంటున్న సందర్భంలో పార్లమెంట్‌ లోని ఉభయ సభల్లో రెండు రోజులపాటు ప్రత్యేక చర్చ జరగనుంది. ఈ చర్చలో భాగంగా, లోక్‌సభలో శుక్రవారం ఉదయం జీరో అవర్‌ ముగిసిన అనంతరం రాజ్యాంగంపై చర్చ ప్రారంభం అవుతుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ చర్చను ప్రారంభించనున్నారు. ఈ చర్చ శనివారం వరకు కొనసాగించనుంది, ఇందులో సభ్యులు రాజ్యాంగంపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. చర్చ ముగింపు సందర్భంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వనున్నారు.

వివరాలు 

రాజ్యసభలో కూడా రాజ్యాంగంపై చర్చ 

అదే విధంగా, రాజ్యసభలో కూడా రాజ్యాంగంపై రెండు రోజులపాటు ప్రత్యేక చర్చ జరగనుంది. ఈ చర్చ 16, 17 తేదీల్లో జరగబోతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సోమవారం చర్చను ప్రారంభిస్తారు. 17వ తేదీన, అంటే మంగళవారం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ చర్చపై ప్రసంగించనున్నారు.