Rahul Gandhi: పార్లమెంట్ లో అంబేద్కర్ రచ్చ .. రాహుల్ గాందీ అరెస్టు తప్పదా ?
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్టు కావడానికి అవకాశం ఉంటుందని ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్‌లో హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఇండియా కూటమి ఎంపీలు నిరసనకు దిగిన సందర్భంగా, రాహుల్ గాంధీ కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎన్డీయే ఎంపీలతో విభేదాలు ఏర్పడినప్పుడు ఇద్దరు కాషాయ ఎంపీలకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై బీజేపీ ఎంపీల ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి, రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు.
రాహుల్ గాంధీపై ఫిర్యాదు
పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్‌కు వెళ్లిన బీజేపీ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, ఇతర ఎంపీలు రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశారు. తర్వాత కాంగ్రెస్ ఎంపీలు కూడా వెళ్లి బీజేపీ నేతలపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రాహుల్ గాంధీపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అందులో భారతీయ న్యాయసంహితలోని సెక్షన్ 117, సెక్షన్ 115, సెక్షన్ 125, సెక్షన్ 131, సెక్షన్ 3(5) వంటి సెక్షన్లు ఉన్నాయి.
రాహుల్ గాంధీని అరెస్టు చేసినా బెయిల్‌పై విడుదల అయ్యే అవకాశం
ఈ కేసుల్లో రాహుల్ గాంధీపై దోషి అయినట్లయితే ఏడాది నుండి ఏడేళ్ల వరకు శిక్షలు ఉన్నాయి. సెక్షన్ 117, సెక్షన్ 125 కింద నేరం జరిగితే వారెంట్ లేకుండా కూడా అరెస్టు చేయవచ్చు. అయితే, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం, ఏడేళ్ల శిక్ష విధించు నేరాల్లో నిందితులను అరెస్టు చేయడం తప్పనిసరి కాదు. ఈ నేరాలు బెయిల్ పొందగలిగే నేరాలు కావడం వలన, రాహుల్ గాంధీని అరెస్టు చేసినా బెయిల్‌పై విడుదల అయ్యే అవకాశం ఉంది.