LOADING...
CP Radhakrishnan: నేడు ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణ స్వీకారం 
నేడు ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణ స్వీకారం

CP Radhakrishnan: నేడు ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణ స్వీకారం 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 12, 2025
09:32 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత దేశం 17వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ శుక్రవారం ఉదయం 10 గంటలకు అధికార ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయన చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రుల సహా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధులుగా పాల్గొననున్నారు. భారత మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానమంత్రులు, మాజీ ఉప రాష్ట్రపతులనూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇందులో ప్రత్యేకంగా పూర్వ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు.

వివరాలు 

మహారాష్ట్ర గవర్నర్ గా ఆచార్య దేవవ్రత్‌

ఈ ఉప రాష్ట్రపతి ఎన్నిక, ఈ నెల 9న నిర్వహించిన పోలింగ్ ద్వారా జరిగింది. ఎన్డీయే కూటమి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ తన ప్రధాన ప్రత్యర్థి జస్టిస్‌ బి. సుదర్శన్‌రెడ్డిపై 152 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అన్ని అధికార లాంఛనలు పూర్తయిన తర్వాత, గురువారం మహారాష్ట్ర గవర్నర్ పదవికి సీపీ రాధాకృష్ణన్‌ రాజీనామా చేశారు. దీంతో మహారాష్ట్ర బాధ్యతలను గుజరాత్‌ గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌కు రాష్ట్రపతి ముర్ము అప్పగించారు.