Cyclone Dana: 'దానా' తుఫాన్ ఎఫెక్టు.. ఆంధ్ర, ఒడిశా, బెంగాల్‌కు ఐఎండీ అలర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడుతూ, ఈరోజు తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
ఈ వాయుగుండం ప్రస్తుతం గంటకు 6 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది.
దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఈ తుఫాన్‌కు 'దానా' అని నామకరణం చేసినట్లు ఐఎండీ పేర్కొంది. వాతావరణ శాఖ అధికారులు, వాయుగుండం ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు.
దీని ప్రభావంతో, బంగాళాఖాతం తీరం వెంబడి గంటకు 45-65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
Details
రాయలసీమలో భారీ వర్షాలు
దీని కారణంగా విజయనగరం, మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
అలాగే, రుతుపవనాల ప్రభావంతో రాయలసీమలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.
పశ్చిమ బెంగాల్‌లోని 7 జిల్లాలకు, ముఖ్యంగా పుర్బా, పశ్చిమ మిడ్నాపూర్, ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాలకు కూడా హెచ్చరికలు జారీ చేశారు.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎలర్ట్‌లో ఉండాలని సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితులను సమీక్షించేందుకు 24x7 కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయమని ఆదేశాలిచ్చారు.
తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లడం మానుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది.