Page Loader
PM Modi: మ‌న సోద‌రీమ‌ణుల సింధూరాన్ని తొల‌గించాల‌ని చూస్తే.. ఉగ్ర‌వాదుల అంతం ద‌గ్గ‌ర ప‌డిన‌ట్లే : మోదీ
మ‌న సోద‌రీమ‌ణుల సింధూరాన్ని తొల‌గించాల‌ని చూస్తే.. ఉగ్ర‌వాదుల అంతం ద‌గ్గ‌ర ప‌డిన‌ట్లే : మోదీ

PM Modi: మ‌న సోద‌రీమ‌ణుల సింధూరాన్ని తొల‌గించాల‌ని చూస్తే.. ఉగ్ర‌వాదుల అంతం ద‌గ్గ‌ర ప‌డిన‌ట్లే : మోదీ

వ్రాసిన వారు Sirish Praharaju
May 26, 2025
03:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

గుజరాత్ రాష్ట్రంలోని దాహోద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్‌ను ద్వేషించడం పాకిస్థాన్ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నదని చెప్పారు. పాకిస్తాన్ ఎప్పుడూ మన దేశానికి హాని చేయాలన్న ఉద్దేశంతోనే పనిచేస్తుందని చెప్పారు. కానీ భారత్ మాత్రం పేదరిక నిర్మూలన,ఆర్థికాభివృద్ధి వంటి శ్రేయస్కరమైన అంశాలపైనే దృష్టి సారిస్తోందని వివరించారు. ఆపరేషన్ సిందూర్ గురించి ప్రధాని మోదీ ప్రస్తావిస్తూ... "మన మహిళల సింధూరాన్ని తొలగించాలనుకునే ఉగ్రవాదులు మట్టికరవాల్సిన రోజులు దగ్గర్లోనే ఉన్నాయి" అని అన్నారు. వడోదరలో జరిగిన రోడ్ షో గురించి చెబుతూ,వేలాదిమంది తల్లులు,అక్కాచెల్లెళ్లు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారని తెలిపారు.

వివరాలు 

ఆపరేషన్ సిందూర్‌కి ఆశీర్వాదాలు

భారత సైనిక దళాలు సాధించిన విజయం పట్ల వారు ఎంతో ఆనందం వ్యక్తం చేశారని చెప్పారు. తామంతా తిరంగ ర్యాలీ నిర్వహిస్తూ, ఆపరేషన్ సిందూర్‌కి ఆశీర్వాదాలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు ఏంచేశారో అందరికీ తెలుసునని మోదీ చెప్పారు. "భారతదేశం లేదా నేను మౌనంగా కూర్చుంటామనుకుంటున్నారా?" అని ప్రశ్నించారు. ఎవరైనా మన మహిళల సింధూరాన్ని లాక్కొవాలనే ఆలోచన వచ్చినా,అటువంటివారిని పూర్తిగా నాశనం చేయడమే తమ లక్ష్యమవుతుందని స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ కేవలం ఒక మిలటరీ ఆపరేషన్ మాత్రమే కాదని, అది భావోద్వేగాలతో కూడుకున్న అంశమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. "మోదీతో ఉగ్రవాదులు తలపడాలనుకోవడం కలల్లోనైనా ఊహించనిది కావాలి"అని హెచ్చరించారు. పెహ‌ల్గామ్ దాడి ఘ‌ట‌న ఫోటోల‌ను చూస్తుంటే ర‌క్తం మ‌రుగుతోంద‌న్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బహిరంగ సభలో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ