Page Loader
Sonia Gandhi: 'ప్రజాస్వామ్యం గొంతు నొక్కారు': 141 మంది ఎంపీల సస్పెన్షన్‌పై సోనియా గాంధీ
'ప్రజాస్వామ్యం గొంతు నొక్కారు': 141 మంది ఎంపీల సస్పెన్షన్‌పై సోనియా గాంధీ

Sonia Gandhi: 'ప్రజాస్వామ్యం గొంతు నొక్కారు': 141 మంది ఎంపీల సస్పెన్షన్‌పై సోనియా గాంధీ

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 20, 2023
11:05 am

ఈ వార్తాకథనం ఏంటి

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) అధినేత్రి సోనియా గాంధీ బుధవారం నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. డిసెంబర్ 13 నాటి పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుండి ప్రకటన కోరాలన్న ప్రతిపక్ష ఎంపీల డిమాండ్‌లకు మద్దతుగా ఆమె మాట్లాడారు. 141 మంది విపక్ష ఎంపీలను ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని ఆమె ఖండించారు. ఈ (నరేంద్ర మోదీ) ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కింది. గతంలో ఎన్నడూ లేనంత మంది ప్రతిపక్ష సభ్యులను సభ నుండి సస్పెండ్ చేయడం (లోక్‌సభ,రాజ్యసభ), సహేతుకమైనది కాదన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో మాట్లాడుతున్న సోనియా