Telagana Budget:అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క..ఏ రంగానికి ఎన్ని కోట్లు అంటే ?
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 2024-25 రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2,91,159కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీనిలో మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా పేర్కొన్నారు. అంతకముందు,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ కేబినెట్ 2024-25 రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. జులై 27న బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుంది, అదే రోజు ప్రతిపక్షాల ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానం ఇవ్వనున్నారు. జూలై 28, 29 తేదీల్లో గ్రాంట్‌లపై చర్చలు జరగనున్నాయి, జూలై 30న ఆర్థిక మంత్రి సమాధానాలు ఇస్తారు. 2024-25కి సంబంధించిన విభజన బిల్లు జూలై 31న ఆమోదించబడుతుంది.
బడ్జెట్: ఏ రంగానికి ఎన్ని కోట్లు అంటే ?
మొత్తం తెలంగాణ బడ్జెట్ రూ. 2,91,159 కోట్లు రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు మూలధన వ్యయం రూ. 33,487 కోట్లు వ్యవసాయానికి రూ. 72,659 కోట్లు ఉద్యానవనం రూ. 737 కోట్లు పశుసంవర్ధకం రూ.1,980 కోట్లు రూ.500 గ్యాస్ సిలిండర్ పధకానికి రూ.723 కోట్లు గృహాజ్యోతికి రూ. 2,418 కోట్లు మెట్రో వాటర్ వర్క్స్ - రూ. 3,385 కోట్లు హైడ్రా సంస్థ - రూ. 200 కోట్లు జీహెచ్ఎంసీలో మౌలిక వసతులు కల్పన - రూ. 3,065 కోట్లు హెచ్ఎండీఏలో మౌలిక వసతుల కల్పన రూ. 500 కోట్లు
జీహెచ్ఎంసీ పరిధిలో కేటాయింపులు ఇలా..
మెట్రో వాటర్ వర్క్స్ రూ. 3,385 కోట్లు హైడ్రా సంస్థ రూ. 200 కోట్లు జీహెచ్ఎంసీలో మౌలిక వసతులు కల్పన రూ. 3,065 కోట్లు హెచ్ఎండీఏలో మౌలిక వసతుల కల్పన రూ. 500 కోట్లు విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణ రూ. 100 కోట్లు హైదరాబాద్ నగర అభివృద్ధికి రూ. 10 వేల కోట్లు మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూఏ. 1500 కోట్లు ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు రూ. 1525 కోట్లు పాతబస్తీ మెట్రో విస్తరణకు రూ. 500 కోట్లు మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ రూ. 50 కోట్లు ఔటర్ రింగ్ రోడ్డుకు రూ. 200 కోట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ. 500 కోట్లు
సంక్షేమానికి కేటాయింపులు ఇలా..
బీసీ సంక్షేమం రూ. 9,200 కోట్లు ఎస్టీ సంక్షేమం రూ. 17,056 కోట్లు మైనార్టీ సంక్షేమం రూ. 3,003 కోట్లు స్త్రీ, శిశు సంక్షేమం రూ. 2,736 కోట్లు ఎస్సీ సంక్షేమం రూ. 33124 కోట్లు
హోం శాఖ రూ. 9,564 కోట్లు
హోం శాఖ రూ. 9,564 కోట్లు వైద్యం ఆరోగ్యం రూ. 11,468 కోట్లు ఐటీ రంగం రూ. 774 కోట్లు నీటిపారుదల శాఖకు రూ. 22,301 కోట్లు ఆర్ అండ్ బీ రూ. 5,790 కోట్లు పరిశ్రమల శాఖ రూ. 2,762 కోట్లు విద్యారంగం రూ. 21,292 కోట్లు ట్రాన్స్‌కో, డిస్కంలు రూ. 16,410 కోట్లు అడవులు పర్యావరణం రూ. 1,064 కోట్లు
ప్రజా పంపిణీ కోసం రూ. 3,836 కోట్లు
ప్రజా పంపిణీ కోసం రూ. 3,836 కోట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కోసం రూ. 29,816 కోట్లు ఇందిరా మహిళా శక్తి పథకానికి రూ. 50.41 కోట్లు