Reservations-Amith Sha-Bjp Complaint: రిజర్వేషన్ల పై అమిత్ షా వ్యాఖ్యలను వీడియో మార్ఫింగ్ చేశారు...ఫిర్యాదు చేసిన బీజేపీ
కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith Sha) షెడ్యూల్డ్ కులాలు (Sc), షెడ్యూల్డ్ తెగల (St)రిజర్వేషన్లను (Reservations) రద్దు చేస్తానని మాట్లాడిన వీడియో (Video) నకిలీదని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది. ఆ నకిలీ వీడియోపై ఆదివారం బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. లోక్ సభ ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా తెలంగాణ (Telangana)లో ముస్లిం (Muslim)లకు 4 శాతం రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను మాత్రమే తొలగిస్తామని వ్యాఖ్యానించారని తెలిపింది. అయితే ముస్లిం అనే పదాన్ని ఎడిట్ చేసి మొత్తం రిజర్వేషన్లను రద్దు చేస్తామని నకిలీ వీడియోను సృష్టించారని ఆ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో బీజేపీ ఫిర్యాదు మేరకు ఢిల్లీ (Delhi) పోలీసులు కేసు నమోదు చేశారు.
ఫిర్యాదు చేసిన బీజేపీ.. ఎఫ్ ఐ ఆర్ నమోదు
ఎడిట్ చేసిన వీడియోను పోస్ట్ చేసిన ఖాతా గురించి సమాచారాన్ని కోరుతూ సామాజిక మాధ్యమాలైన ఎక్స్, ఫేస్ బుక్ కు లేఖ రాశారు. ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్‌ను తొలగించేందుకు బీజేపీ సిద్ధమవుతోందని పేర్కొంటూ అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ విభాగాలు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి విపరీతంగా వైరల్ చేశారు. బీజేపీ(Bjp)ప్రభుత్వం మళ్లీ ఏర్పడితే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా చెప్పారంటూ ఆదివారం జార్ఖండ్ కాంగ్రెస్(Congress)ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. బీజేపీ నాయకుడు అమిత్ మాల్వియా మాట్లాడుతూ.... కాంగ్రెస్ ఎడిట్ చేసిన వీడియోను వ్యాప్తి చేస్తోందని పెద్ద ఎత్తున హింసకు దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.