Page Loader
భోపాల్-దిల్లీ వందే భారత్ రైలు కోచ్‌లో మంటలు
భోపాల్-దిల్లీ వందే భారత్ రైలు కోచ్‌లో మంటలు

భోపాల్-దిల్లీ వందే భారత్ రైలు కోచ్‌లో మంటలు

వ్రాసిన వారు Stalin
Jul 17, 2023
10:18 am

ఈ వార్తాకథనం ఏంటి

భోపాల్ నుంచి దిల్లీ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలులోని ఓ కోచ్‌లో సోమవారం ఉదయం మంటలు చెలరేగాయి. మధ్యప్రదేశ్‌లోని కుర్వాయి కేతోరా రైల్వే స్టేషన్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులోని కోచ్ నంబర్ సీ-14 బ్యాటరీ బాక్స్‌లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసినట్లు భారతీయ రైల్వే వెల్లడించింది. ప్రయాణికులను కూడా సురక్షితంగా బయటకు పంపించారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని రైల్వేశాఖ వెల్లడించింది. కోచ్‌లో మంటలు కనిపించగా, కొంతమంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియో వైరల్‌గా మారింది. ఏప్రిల్‌లో భోపాల్- దిల్లీ మధ్య ప్రయాణించే ఈ వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వందేభారత్ రైలులో అగ్ని ప్రమాదం దృశ్యం