LOADING...
Ashwini Vaishnaw: సెప్టెంబర్ లో పట్టాలెక్కనున్న తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన
అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన

Ashwini Vaishnaw: సెప్టెంబర్ లో పట్టాలెక్కనున్న తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 04, 2025
08:26 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. రానున్న సెప్టెంబర్ నెలలో ఈ సర్వీసును ప్రారంభించనున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. మోదీ ప్రభుత్వం ఆధునికీకరణపై దృష్టి పెట్టిందని, అందులో భాగంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌, అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌, నమో భారత్ రాపిడ్ రైల్‌ వంటి ఆధునిక రైళ్లను ప్రవేశపెట్టిందని మంత్రి పేర్కొన్నారు. ఇదే క్రమంలో త్వరలో వందే భారత్ స్లీపర్ రైలును కూడా ప్రయాణికుల సేవలోకి తీసుకొస్తామని చెప్పారు.

వివరాలు 

 ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పనులు వేగంగా సాగుతున్నాయి: అశ్విని వైష్ణవ్   

ఆదివారం నాడు భావ్‌నగర్ టెర్మినస్‌ నుంచి అయోధ్య ఎక్స్‌ప్రెస్‌, రేవా-పుణె ఎక్స్‌ప్రెస్‌, జబల్‌పూర్-రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను వర్చువల్ విధానంలో అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తొలి వందే భారత్ స్లీపర్ రైలు సేవలు సెప్టెంబర్‌లో ప్రారంభమవుతాయని అధికారికంగా ప్రకటించారు. మరోవైపు ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పనులు వేగంగా సాగుతున్నాయని మంత్రి తెలిపారు. ఈ హైస్పీడ్ రైలు త్వరలో సేవలందించనున్నట్టు చెప్పారు.ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం కేవలం 2 గంటలు 7 నిమిషాలకు పరిమితం కానుందని వివరించారు.

వివరాలు 

దేశవ్యాప్తంగా ఉన్న 1300రైల్వే స్టేషన్లను ఆధునికరణ 

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 34,000కిలోమీటర్లకు పైగా కొత్త రైలు పట్టాలు ఏర్పాటు చేయగా,ప్రస్తుతం రోజుకు సగటున 12కిలోమీటర్ల ట్రాక్‌లు నిర్మాణంలో ఉన్నాయని వెల్లడించారు. ఇది భారత రైల్వే చరిత్రలో అతిపెద్ద ప్రగతిగా అభివర్ణించారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టు వివరాలు వెల్లడిస్తూ,ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్(BKC)నుంచి గుజరాత్‌లోని వాపి,సూరత్, ఆనంద్, వడోదర,అహ్మదాబాద్‌ వరకూ ఈ రైలు నడుస్తుందని తెలిపారు. ఇది గంటకు 320కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని వివరించారు.దేశవ్యాప్తంగా ఉన్న 1300రైల్వే స్టేషన్లను ఆధునికీకరించి, అంతర్జాతీయ ప్రమాణాల స్థాయికి తీసుకెళ్తున్నట్టు చెప్పారు. అలాగే పోర్బందర్ నుంచి రాజ్‌కోట్‌దాకా వాన్స్‌జాలియా,జెటల్సర్ మీదుగా కొత్త రైలు సర్వీసును త్వరలో ప్రారంభించనున్నట్టు తెలిపారు. అదేవిధంగా రణవావ్ స్టేషన్‌లో రూ.135 కోట్ల వ్యయంతో ఆధునిక కోచ్ మెయింటెనెన్స్ ఫెసిలిటీ అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మినిస్ట్రీ అఫ్ రైల్వేస్ చేసిన ట్వీట్