Page Loader
Narendra Modi: ప్రధాని మోదీకి తెలుగు రాష్ట్రాల సీఎంల శుభాకాంక్షలు 
ప్రధాని మోదీకి తెలుగు రాష్ట్రాల సీఎంల శుభాకాంక్షలు

Narendra Modi: ప్రధాని మోదీకి తెలుగు రాష్ట్రాల సీఎంల శుభాకాంక్షలు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 17, 2024
03:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు శుభాకాంక్షలను తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మంచి ఆరోగ్యం, దేశ సేవలో దీర్ఘాయుష్షు పొందాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆయన దార్శనిక నాయకత్వం ద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Details

శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రధాని మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాన మంత్రి జన్మదినం సందర్భంగా, ఆరోగ్యం, మనోబలం, సమగ్ర పురోగతిని కోరుకుంటున్నానని ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రధాన మంత్రి మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు, మరియు శక్తి ఉండాలని కోరుకుంటున్నానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆయన మార్గదర్శకత్వంలో భారతదేశం శాంతి, శ్రేయస్సు సాధించాలని సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ తెలిపారు.