#Newsbytesexplainer: భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలం.. 9 మంది మృతి
రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారీ వర్షాల కారణంగా అతలాకుతలమైంది. రాష్ట్రవ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లో 20 సెంటీమీటర్లకంటే ఎక్కువ వర్షపాతం నమోదవ్వగా, ఈ ప్రకృతి విపత్తు కారణంగా 9 మంది ప్రాణాలను విడిచారు. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ముంపు బారిన పడిన 294 గ్రామాల నుంచి 13,227 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. వీరి రక్షణకై పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్), ఎస్డీఆర్‌ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందాలు పనిచేసి 600 మందిని రక్షించాయి.
30 ఏళ్లలో విజయవాడలో ఎన్నడూ లేనంత వర్షపాతం
బాధితుల కోసం ప్రభుత్వం 25 కిలోల బియ్యం, ఒక్కో కిలో చొప్పున నిత్యావసరాలను అందజేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, మత్స్యకారులు, చేనేత కార్మికులకు అదనంగా 50 కిలోల బియ్యం ఇస్తున్నామని ప్రకటించారు. విజయవాడలో 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతంగా వర్షం కురిసింది. ఓకే రోజు 20 సెం.మీ వర్షపాతం నమోదైంది. బుడమేరు వాగు ఉధృతంగా ప్రవహించింది. దీంతో ఆ నీరంతా సమీప కాలనీకు చేరింది. పట్టణ పరిధిలోని అత్యధిక శాతం జలదిగ్భధంలో చిక్కుకుపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : చిరంజీవి
రోడ్లపై పడవలు వేసుకొని తిరిగాల్సి వచ్చిందంటే విజయవాడలో ఎంతదారుణమైన పరిస్థితి నెలకొందే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక రైల్వే పట్టాలపై నీరు చేయడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జాతీయ రహాదారిపై వరదనీరు భారీగా చేరడంతో విజయవాడ-హైదరాబాద్ మార్గాల మధ్య రాకపోకలకు ఇబ్బందిగా మారింది. కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు గుంటూరు జిల్లాలో కూడా భారీ నష్టం సంభవించింది. భారీ వర్షాలతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సినీ నటుడు చిరంజీవి ప్రజలకు సూచించారు.