Champai Soren: విశ్వాస పరీక్షల్లో నెగ్గిన చంపాయ్ సోరెన్
జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ సోమవారం అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో మొత్తం 47 మంది సంకీర్ణ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు ఇవ్వడంతో బలపరీక్షలో విజయం సాధించారు. ప్రతిపక్షానికి 29 ఓట్లు వచ్చాయి. చంపాయ్ సోరెన్ గెలుపును జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రకటించారు. 81 మంది సభ్యుల జార్ఖండ్ శాసనసభలో మెజారిటీ మార్క్ 41. నేటి లిట్మస్ పరీక్షకు ముందు, చంపాయ్ సోరెన్ గతంలో జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM)కి 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, అది 50కి పెరగవచ్చని చెప్పారు. భూ కుంభకోణంలో ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్న హేమంత్ సోరెన్, పిఎంఎల్‌ఎ కోర్టులో పాల్గొనడానికి అనుమతించడంతో సోమవారం విశ్వాస ఓటుకు కూడా హాజరయ్యారు.
బీజేపీపై చంపయీ సోరెన్ విమర్శలు
అసెంబ్లీలో హేమంత్ సోరెన్ మాట్లాడుతూ, బీజేపీ నేతృత్వంలోని కేంద్రాన్ని నిందించారు. ఈ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అనంతరం సీఎం చంపయీ సోరెన్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ' ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ యత్నించిందన్నారు. హేమంత్ సోరెన్‌పై తప్పుడు కేసు పెట్టారన్న ఆయన కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందన్నారు. నేను ఆయనకు పార్ట్-2' అని చంపయీ(Champai Soren) వ్యాఖ్యానించారు.
40 మంది సంకీర్ణ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు
భూ కుంభకోణంలో తన సంబంధాన్ని నిరూపించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను సవాలు చేశారు. "నిజం నిరూపిస్తే, నేను రాజకీయాల నుండి తప్పుకుంటాను" అని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి అన్నారు. కీలకమైన విశ్వాస పరీక్షకు ముందు, బిజెపి చేస్తున్న ఆరోపనలను అడ్డుకునే ప్రయత్నంలో దాదాపు 40 మంది సంకీర్ణ ఎమ్మెల్యేలను తెలంగాణలోని హైదరాబాద్‌కు తరలించారు. నేటి విశ్వాస ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఎమ్మెల్యేలు ఆదివారం (ఫిబ్రవరి 4) సాయంత్రం రాంచీకి తిరిగి వచ్చారు. ఎమ్మెల్యేలను రాంచీలోని సర్క్యూట్ హౌస్‌కి తీసుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.