
Rain Alert : బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం.. నేడూ స్కూళ్లకు సెలవు
ఈ వార్తాకథనం ఏంటి
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు కూడా నమోదవుతున్నాయి. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి.
వాగులు, వంకలు, నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
భారీ వర్షాల కారణంగా కాళంగి రిజర్వాయర్, అరణియార్ ప్రాజెక్ట్‌ల నుంచి నీటిని విడుదల చేశారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టులు, డ్యామ్‌లు కూడా పూర్తిస్థాయిలో నిండాయి.
వివరాలు
విద్యాసంస్థలకు సెలవులు
ఈ నేపథ్యంలో, వర్షాల ప్రభావంతో తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.
స్కూళ్లు, కాలేజీలు, అంగన్‌వాడీ సెంటర్లు తాత్కాలికంగా మూసివేశారు.
జిల్లావ్యాప్తంగా ఈ రోజు విద్యాసంస్థలకు సెలవు ఇవ్వడం జరిగిందని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ భన్సల్ తెలిపారు.
అల్పపీడన ప్రభావం కొనసాగుతుండటంతో తిరుపతి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలు సెలవుగా ప్రకటించినట్లు స్పష్టంగా వివరించారు.