
Tahawwur Rana: తహవ్వూర్ రాణా అప్పగింతపై భారతదేశం 14 సంవత్సరాలుగా న్యాయ పోరాటం ఎలా చేసింది?
ఈ వార్తాకథనం ఏంటి
2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. 10 మంది ఉగ్రవాదులు నిర్వహించిన ఈ భీకర దాడి ప్రపంచాన్ని కుదిపేసింది.
ఈ దాడికి సంబంధించి ప్రధాన సూత్రధారుల్లో ఒకడిగా భావించబడుతున్న తహవ్వుర్ హుస్సేన్ రాణాను అమెరికా ఇప్పటికే పలు కేసుల్లో అరెస్టు చేసినప్పటికీ, అతడిని ముంబయి దాడి కేసులో విచారణ నిమిత్తం భారత్‌కు తీసుకురావడానికి దాదాపు 14 ఏళ్ల కాలం పట్టింది.
వివరాలు
బాల్యం నుంచి అనుబంధం
26/11 దాడికి ప్రధాన సూత్రధారి అయిన పాకిస్థానీ-అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కోల్‌మన్ హెడ్లీకి రాణా చిన్ననాటి స్నేహితుడు.
హెడ్లీ తండ్రి పాకిస్థాన్‌కు చెందిన రాజనీతికుడైనా, తల్లి అమెరికన్ కావడంతో అతడు బాల్యం అంతా పాకిస్థాన్‌లో గడిపాడు.
అక్కడే రాణాతో కలిసి సైనిక పాఠశాలలో చదువుకున్నాడు. తరువాత హెడ్లీ అమెరికా వెళ్లినా, పాకిస్థానీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కొనసాగించాడు.
ఇతడు భారత్‌లో బిజినెస్ కన్సల్టెంట్‌గా పర్యటనలు చేసిన సమయంలో తహవ్వుర్ రాణా తన ఇమిగ్రేషన్ సంస్థ ద్వారా సహాయం చేసినట్లు ఆధారాలు వెల్లడి.
వివరాలు
ఎఫ్‌బీఐ అరెస్ట్
ముంబయి దాడులకు సంవత్సరం తర్వాత, 2009 అక్టోబరులో అమెరికా ఎఫ్‌బీఐ దర్యాప్తు సంస్థ తహవ్వుర్ రాణాను అరెస్టు చేసింది.
అతడు లష్కర్-ఏ-తొయిబా ఉగ్రసంస్థతో కలిసి డెన్మార్క్‌లోని పత్రికా కార్యాలయాలపై దాడికి కుట్రపన్నాడన్న ఆరోపణలపై షికాగోలో అరెస్ట్ అయిపోయాడు.
అప్పటి నుంచి అతడిని లాస్‌ఏంజెలెస్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో నిర్బంధించారు.
వివరాలు
చార్జిషీట్లు - పాత్ర స్పష్టత
ముంబయి పోలీసులు 2009లో మొదటగా దాఖలు చేసిన చార్జిషీట్‌లో రాణా పేరు లేకపోయినా, కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ 2011లో అతడి పేరును చేర్చి,అతడిని ఈదాడికి కీలక కుట్రదారిగా పేర్కొంది.
హెడ్లీకి రవాణా,ఆర్థిక సహాయం చేసిన విషయంలో రాణా పాత్రను వివరంగా చర్చించింది. ఈ దాడికి రెండు సంవత్సరాల ముందే హెడ్లీ లక్ష్య ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్లు కూడా తెలుస్తోంది.
భారత్ దౌత్య ప్రయత్నాలు
భారత్ ప్రభుత్వం 2019లో అమెరికా ప్రభుత్వానికి రాణాను అప్పగించాలంటూ లేఖ రాసి,అధికారికంగా అభ్యర్థించింది.
2020లో కాలిఫోర్నియా కోర్టులో అరెస్ట్ వారెంట్ కోసం దరఖాస్తు చేయగా అనుమతి లభించింది. అయితే, ఇదే ఆరోపణలపై రెండుసార్లు విచారణ చేయలేమంటూ రాణా తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించినా,కోర్టు వాటిని తోసిపుచ్చింది.
వివరాలు
అప్పగింతను అడ్డుకునేందుకు ప్రయత్నాలు
అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ కూడా రాణా భారత్‌కు అప్పగింపును ఆమోదించారు.
అమెరికాలోని వివిధ న్యాయస్థానాల్లో రాణా అనేక పిటిషన్లు దాఖలు చేస్తూ భారత్‌కు అప్పగించకూడదని వాదించాడు.
చివరకు 2024 నవంబరులో శాన్ ఫ్రాన్సిస్కో అప్పీల్ కోర్టు ఈ విషయంలో తీర్పునివ్వడంతో,అతడు అమెరికా సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.
అయితే, 2025 జనవరి 21న ఆ కోర్టు కూడా పిటిషన్‌ను తోసిపుచ్చింది. భారత్‌కు అప్పగించాల్సిన దశకు రాణా చేరుకున్న సమయంలో,మోదీ అమెరికా పర్యటనకు ముందురోజు (ఫిబ్రవరి 11న) అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.
ఆరోగ్య కారణాలు చూపుతూ రాణా మరోసారి న్యాయస్థానాలను ఆశ్రయించినా, కోర్టులు వాటిని తిరస్కరించడంతో, చివరకు అతడు భారత్ విమానం ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.