NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Hyderabad: 'కరాచీ బేకరీ 100% భారత సంస్థే..పాకిస్తానీ బ్రాండ్ కాదు': యజమానుల స్పష్టత 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Hyderabad: 'కరాచీ బేకరీ 100% భారత సంస్థే..పాకిస్తానీ బ్రాండ్ కాదు': యజమానుల స్పష్టత 
    'కరాచీ బేకరీ 100% భారత సంస్థే..పాకిస్తానీ బ్రాండ్ కాదు': యజమానుల స్పష్టత

    Hyderabad: 'కరాచీ బేకరీ 100% భారత సంస్థే..పాకిస్తానీ బ్రాండ్ కాదు': యజమానుల స్పష్టత 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 09, 2025
    01:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలోని అనేక నగరాల్లో విజయవంతంగా తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్న ప్రముఖ బ్రాండ్ కరాచీ బేకరీ గురించి ప్రస్తుతం ప్రజల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.

    భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఈ బ్రాండ్ పేరు "కరాచీ"గా ఉండటం వల్ల ఇది పాకిస్తాన్‌కు చెందినదేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

    ఎందుకంటే కరాచీ అనేది పాకిస్థాన్‌లోని ఒక ప్రముఖ నగరం కావడం గమనార్హం.

    ఈ నేపథ్యంలో ప్రజలలో స్పష్టత కల్పించాలనే ఉద్దేశంతో కరాచీ బేకరీ యజమానులు ఒక అధికారిక ప్రకటన చేశారు.

    తమ బ్రాండ్ పుట్టుక భారతదేశంలోనే జరిగిందని,పూర్తి స్థాయిలో ఇది భారతీయ సంస్థే అని వారు పేర్కొన్నారు.

    వివరాలు 

     ఊరి పేరు జ్ఞాపకార్థంగా "కరాచీ బేకరీ" 

    ఈప్రకారం,తమ బేకరీ మొదటిసారిగా 1953లో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో స్థాపించినట్లు వారు తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపారు.

    కరాచీ అనే పేరు చరిత్ర సంబంధిత నేపథ్యంలో తీసుకున్నప్పటికీ, సంస్థకు పాకిస్తాన్‌తో ఎటువంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు.

    సంస్థ యజమానులు రాజేష్, హరీష్ రామ్నానీలు తెలిపిన ప్రకారం, వారి తాతగారు ఖాన్చంద్ రామ్నానీ భారతదేశ విభజన సమయంలో పాకిస్తాన్‌లోని కరాచీ నుండి భారత్‌కు వచ్చి, హైదరాబాద్‌లో స్థిరపడి బేకరీను ప్రారంభించినట్లు వెల్లడించారు.

    ఆ ఊరి పేరు జ్ఞాపకార్థంగా "కరాచీ బేకరీ" అని పేరు పెట్టారని తెలిపారు.

    వివరాలు 

    కేవలం బేకరీ పేరులో "కరాచీ" అనే పదం.. ఉండడం వల్ల..

    దాదాపు 73 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సంస్థపై ఇటీవల కొన్ని ప్రాంతాల్లో దాడులు జరగడం యజమానులను ఆందోళనకు గురిచేసింది.

    కేవలం బేకరీ పేరులో "కరాచీ" అనే పదం ఉండటం వల్లే ఈ దాడులు జరుగుతున్నాయని వారు అభిప్రాయపడ్డారు.

    హైదరాబాద్‌లోని వారి వ్యాపారానికి భద్రత కల్పించాలని కోరుతూ వారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, డీజీపీని, పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించారు.

    ఇటీవల విశాఖపట్టణంలో కూడా తమ బేకరీపై ఇలాంటి సంఘటన చోటుచేసుకున్నదని యజమానులు వెల్లడించారు.

    ఈ తరహా ఘటనల నేపథ్యంలో బేకరీ పేరును మార్చుకోవాలన్న కొందరి సూచనలపై స్పందిస్తూ, తమకు మద్దతుగా నిలవాలని ప్రజలను, ప్రభుత్వాధికారులను యజమానులు కోరారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    'కరాచీ బేకరీ 100% భారత సంస్థే..పాకిస్తానీ బ్రాండ్ కాదు

    VIDEO | Protests erupt in Hyderabad against a bakery named after Karachi. The owner clarifies and says, "Karachi Bakery was founded here in Hyderabad in 1953 by Khanchand Ramnani, who migrated to India during the Partition. It has been 73 years. Our grandfather named it after… pic.twitter.com/i6dAkwxDIR

    — Press Trust of India (@PTI_News) May 8, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్

    తాజా

    Hyderabad: 'కరాచీ బేకరీ 100% భారత సంస్థే..పాకిస్తానీ బ్రాండ్ కాదు': యజమానుల స్పష్టత  హైదరాబాద్
    Rammohan Naidu: ఇండియా-పాక్ ఉద్రిక్తతల మధ్య రామ్మోహన్ నాయుడికి వై ప్లస్ భద్రత  కింజరాపు రామ్మోహన్ నాయుడు
    Operation Sindoor: భారత్‌లోకి ప్రవేశించేందుకు ముష్కరుల ప్రయత్నాలు.. అడ్డుకొన్న బీఎస్‌ఎఫ్‌.. ఏడుగురు హతం ఆపరేషన్‌ సిందూర్‌
    China: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలపై చైనా ఆందోళన.. సంయమనం పాటించాలని విజ్ఞప్తి చైనా

    హైదరాబాద్

    Hyderabad: 'మహా.. మహా' నగరంగా మారనున్న హైదరాబాద్.. హెచ్‌ఎండీఏ స్థానంలో... హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ రీజియన్‌  భారతదేశం
    Manchu Lakshmi: వివాదంలో మంచు లక్ష్మీ.. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కారణంగా కేసు నమోదు? టాలీవుడ్
    Miss World: భారత్‌కు నా హృదయంలో చాలా ప్రాధాన్యత ఉంది: మిస్‌ వరల్డ్‌ క్రిస్టినా పిస్కోవా  భారతదేశం
    Pasala Krishna Bharathi: స్వాతంత్య్ర సమరయోధ కుటుంబ వారసురాలు పసల కృష్ణభారతి ఇకలేరు నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025