Page Loader
#NewsBytesExplainer: ఏపీకి ఏరోస్పేస్ హబ్ రానుందా? వస్తే ఆర్థికంగా,టెక్నాలజీ పరంగా కలిగే లాభాలేంటి? 
ఏపీకి ఏరోస్పేస్ హబ్ రానుందా? వస్తే ఆర్థికంగా,టెక్నాలజీ పరంగా కలిగే లాభాలేంటి?

#NewsBytesExplainer: ఏపీకి ఏరోస్పేస్ హబ్ రానుందా? వస్తే ఆర్థికంగా,టెక్నాలజీ పరంగా కలిగే లాభాలేంటి? 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 17, 2025
06:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో ఏరోస్పేస్ రంగంలో ఇటీవల కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకవైపు కర్ణాటక ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్‌ను వదులుకోగా, మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానిని చేపట్టేందుకు ఆసక్తిని కనబరుస్తోంది. అసలు ఈ వ్యవహారం ఏంటి? కర్ణాటక ఎందుకు ప్రాజెక్ట్‌ను వదులుకుంది? ఏపీ ఎందుకు ముందుకొచ్చింది? నారా లోకేష్, సిద్ధరామయ్య ఏమన్నారు? వివరంగా చూద్దాం.

వివరాలు 

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక ప్రకటన

బెంగళూరు శివార్లలోని దేవనహళ్లి తాలూకాలో, చెన్నరాయపట్న సహా ఇతర గ్రామాల్లో భారీ స్థాయిలో ఏరోస్పేస్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా వేల ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. కానీ ఆ ప్రాంతంలోని రైతులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకంటే సేకరించబోయే భూమి అత్యంత సారవంతమైనదిగా, తరతరాలుగా తమ జీవనాధారంగా ఉందని రైతులు స్పష్టం చేశారు. భూమిని కోల్పోతే తమ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల నిరసనలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో, చివరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక ప్రకటన చేశారు. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, ఏరోస్పేస్ పార్క్ కోసం చేపట్టిన భూసేకరణను పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు.

వివరాలు 

ప్రాజెక్ట్‌ను వదులుకున్న కర్ణాటక.. అవకాశాన్ని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేసిన ఏపీ 

ఇకపై సున్నితంగా వ్యవహరిస్తామని, భూమిని అమ్మేందుకు సిద్ధంగా ఉన్న రైతుల నుంచి మాత్రమే భూమిని సేకరించనున్నట్లు స్పష్టం చేశారు. వారికి తగిన పరిహారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. పారిశ్రామిక అభివృద్ధి అవసరమే అయినప్పటికీ, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కర్ణాటక ఈ ప్రాజెక్ట్‌ను వదులుకున్న వెంటనే, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ అవకాశాన్ని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఏరోస్పేస్ పరిశ్రమను రాష్ట్రానికి ఆహ్వానిస్తూ ప్రత్యేకంగా పిలుపునిచ్చారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నారా లోకేష్ చేసిన ట్వీట్ 

వివరాలు 

ఆకర్షణీయమైన ఏరోస్పేస్ పాలసీ 

"ప్రియమైన ఏరోస్పేస్ ఇండస్ట్రీ... ఈ వార్త విన్నందుకు ఖచ్చితంగా బాధగా ఉంది. అయితే మీకు నా దగ్గర ఓ మంచి ఆలోచన ఉంది. మీరు ఆంధ్రప్రదేశ్‌ను ఎందుకు పరిశీలించకూడదు? మా వద్ద మీ కోసం ఆకర్షణీయమైన ఏరోస్పేస్ పాలసీ ఉంది. అత్యుత్తమ ప్రోత్సాహకాలతో పాటు బెంగళూరుకు చాలా దగ్గరగా 8,000 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. త్వరలోనే మిమ్మల్ని కలిసేందుకు ఎదురుచూస్తున్నాను" అంటూ నారా లోకేశ్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో,కర్ణాటక ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను కాపాడటానికి కట్టుబడి ఉంటే, ఆంధ్రప్రదేశ్ మాత్రం పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించేందుకు ముందుకు దూసుకుపోతోంది.

వివరాలు 

ఏరోస్పేస్ హబ్ అంటే ఏమిటి? 

దేశవ్యాప్తంగా పారిశ్రామిక అభివృద్ధి, రైతుల సంక్షేమం మధ్య సమతుల్యత ఎలా సాధించాలన్న అంశంపై ఈ ఘటన మరోసారి చర్చ తెరమీదకు తీసుకొచ్చింది. భవిష్యత్తులో ఏపీకి ఏరోస్పేస్ పరిశ్రమ రూపంలో పెద్ద స్థాయిలో అభివృద్ధి సాధించగలుగుతుందా లేదా వేచి చూడాలి. ఏరోస్పేస్ హబ్ అనేది విమానయాన, అంతరిక్ష పరిశోధన రంగాలకు కేంద్రంగా మారే పారిశ్రామిక ప్రదేశం. ఇక్కడ విమానాలు, రాకెట్లు, ఉపగ్రహాలు, వాటికి అవసరమైన ఇంజిన్‌లు, విడిభాగాలు వంటివి తయారు చేయబడతాయి. అంతేకాకుండా వాటి డిజైన్, పరీక్షలు, రిపేర్, మెయింటెనెన్స్ వంటి కార్యకలాపాలు కూడా నిర్వహిస్తారు.

వివరాలు 

ఏరోస్పేస్ అంటే ఏంటి? 

'Aerospace' అనేది రెండు భాగాల కలయిక: Aero అంటే గగనతల లేదా వాయుమండలం (air). Space అంటే అంతరిక్షం. ఈ రెండింటికీ సంబంధించిన పరిశ్రమలను ఏరోస్పేస్ పరిశ్రమగా వ్యవహరిస్తారు. హబ్ అంటే ఏంటి? 'హబ్' అనేది కేంద్ర ప్రదేశం. అనేక కార్యకలాపాలు ఒకే చోట కేంద్రీకృతంగా జరిగే ప్రదేశాన్ని హబ్ అంటారు. ఏరోస్పేస్ హబ్ అంటే ఏంటి? ఇది విస్తృతమైన పరిశ్రమల సమాహారం: విమాన భాగాల తయారీ రాకెట్ భాగాల పరిశోధన ఉపగ్రహ నిర్మాణం డిజైన్, అసెంబ్లీ, టెస్టింగ్ కార్యకలాపాలు ఇక్కడ ప్రభుత్వ సంస్థలు (ISRO, HAL, DRDO)మాత్రమే కాకుండా,ప్రైవేట్ సంస్థలు (TASL, L&T, Boeing, Lockheed Martin వంటి విదేశీ కంపెనీలు) సహా స్టార్ట్‌అప్స్ కూడా భాగస్వాములుగా ఉంటాయి.

వివరాలు 

భారతదేశంలో ఉన్న ప్రముఖ ఏరోస్పేస్ హబ్‌లు: 

హైదరాబాద్: ప్రస్తుతం దేశంలో ప్రధాన ఏరోస్పేస్ హబ్‌లలో ఒకటి. బెంగళూరు: ISRO, HAL, DRDO వంటి ప్రముఖ సంస్థలు ఇక్కడ ఉన్నాయి. నాగ్‌పూర్, పుణె, చెన్నై, విశాఖపట్నం: ఇవి అభివృద్ధి చెందుతున్న ఏరోస్పేస్ కేంద్రాలు. ఈ హబ్‌లలో జరిగే ముఖ్యమైన కార్యకలాపాలు: రక్షణ అవసరాల కోసం విమానాలు, డ్రోన్ల తయారీ ISRO, NASA వంటి సంస్థలకు ఉపగ్రహ భాగాల సరఫరా రాకెట్ భాగాల తయారీ, అసెంబ్లీ ఎయిర్‌క్రాఫ్ట్ మెంటెనెన్స్, రిపేరింగ్ ఫ్లైట్ సిమ్యులేటర్లు, శిక్షణా కేంద్రాల నిర్వహణ

వివరాలు 

ఏరోస్పేస్ హబ్ వల్ల కలిగే లాభాలు: 

ఉద్యోగావకాశాలు: స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు హైటెక్ పరిశ్రమలు: ఆధునిక సాంకేతిక పరిశ్రమలు రాష్ట్రానికి రావడం పరిశోధన అవకాశాలు: విద్యార్థులకు పరిశోధనలో అవకాశాలు టెక్నాలజీలో స్వయం నిర్వర్తన: దేశానికి సాంకేతిక రంగంలో స్వయం సాధికారత మొత్తానికి, ఏపీకి ఏరోస్పేస్ హబ్ వస్తే పారిశ్రామిక అభివృద్ధితో పాటు యువతకు ఉద్యోగాలు, పరిశోధన అవకాశాలు, రాష్ట్రానికి పెట్టుబడులు, టెక్నాలజీ అభివృద్ధి లాంటి అనేక లాభాలు కలగనున్నాయి.