
Rahul Gandhi: దిల్లీ ఆజాద్‌పూర్ మార్కెట్‌లో కూరగాయల వ్యాపారులను కలిసిన రాహుల్ గాంధీ
ఈ వార్తాకథనం ఏంటి
రైతులు, కార్ మెకానిక్‌లతో సమావేశమై అందరినీ ఆశ్చర్య పరిచిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా కూరగాయల వ్యాపారులను కలిశారు.
ఇందుకోసం రాహుల్ గాంధీ మంగళవారం తెల్లవారుజామున దిల్లీలోని ఆసియాలోనే అతిపెద్ద కూరగాయల మార్కెట్ అయిన ఆజాద్‌పూర్ మండికి వెళ్లారు. అక్కడ కూరగాయల వ్యాపారులతో మాట్లాడారు.
రాహుల్ గాంధీ కూరగాయల మార్కెట్ వద్దకు చేరుకోగానే అక్కడున్న జనం ఒక్కసారిగా గుమిగూడారు. రాహుల్ గాంధీ మార్కెట్‌లో కూరగాయల ధరలపై ఆరా తీశారు.
ఇదిలా ఉంటే, శనివారం రాహుల్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఆజాద్‌పూర్ మార్కెట్‌లో కూరగాయల వ్యాపారి కన్నీళ్లు పెట్టుకున్న వీడియోను షేర్ చేశారు.
టమాట సహా కూరగాయల ధరలు పెరగడం వల్ల రోజుకు రూ.100కూడా సంపాదించలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
దిల్లీ
గత రెండు నెలల్లో రాహుల్ సామాన్యులను కలవడం ఇది మూడోసారి
ఆజాద్‌పూర్ మార్కెట్‌లో కూరగాయల మార్కట్‌లో కన్నీళ్లు పెట్టుకున్న వ్యాపారి వీడియోను షేర్ చేసిన అనంతరం రాహుల్ గాంధీ ఆ మార్కెట్‌కు వెళ్లడం గమనార్హం.
అంతకుముందు రాహుల్ హర్యానాలోని సోనిపట్‌లో రైతులతో సమావేశమయ్యారు. అతను స్వయంగా తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఫోటోలను షేర్ చేశారు.
అందులో అతను పొలాల్లో పని చేస్తూ, ట్రాక్టర్లు నడుపుతూ, రైతులతో మాట్లాడుతున్నట్లు కనిపించింది. వారితో భోజనం కూడా చేశారు.
ఆ తర్వాత దిల్లీలోని కరోల్ బాగ్‌లో మోటార్ మెకానిక్స్‌ను కూడా రాహుల్ కలిశారు.
గత రెండు నెలల్లో రాహుల్ సామాన్యుల మధ్యకు వెళ్లి వారితో మాట్లాడడం ఇది మూడోసారి. కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో కూడా రాహుల్ వివిధ రాష్ట్రాల పర్యటనకు వెళ్లి సామాన్య ప్రజలతో మాట్లాడారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దిల్లీ కూరగాయల మార్కెట్‌లో రాహుల్ గాంధీ
जननायक राहुल गांधी जी आज दिल्ली की आजादपुर मंडी में सब्जी और फल विक्रेताओं से मिले।
— Congress (@INCIndia) August 1, 2023
राहुल जी ने उनकी समस्याओं को जाना और समझा।
भारत जोड़ो यात्रा जारी है... 🇮🇳 pic.twitter.com/g0PuMD3tEi