LOADING...
Ajit Doval: ట్రంప్ సుంకాల బెదిరింపుల వేళ.. మాస్కో పర్యటనకు NSA అజిత్ దోవల్ 
ట్రంప్ సుంకాల బెదిరింపుల వేళ.. మాస్కో పర్యటనకు NSA అజిత్ దోవల్

Ajit Doval: ట్రంప్ సుంకాల బెదిరింపుల వేళ.. మాస్కో పర్యటనకు NSA అజిత్ దోవల్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 06, 2025
08:15 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నదన్న కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తీవ్రమైన వ్యాఖ్యల నేపథ్యంలో, భారత్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ రష్యా పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటన ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే దోవల్‌ పర్యటన ముందుగానే ఖరారైందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయినా, ఇటీవల ట్రంప్‌ చేసిన విమర్శల నేపథ్యంలో ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యత లభించింది. మాస్కోతో భారత్‌ మైత్రీ సంబంధాలు, ముఖ్యంగా రక్షణ రంగంలో భాగస్వామ్యం, ఇంధన సహకారం తదితర అంశాలపై చర్చించేందుకే ఈ పర్యటన కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

వివరాలు 

 రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌తో భేటీ 

దోవల్‌ పర్యటనలో రష్యా చమురు సరఫరాలు,పరిశ్రమల సహకారం వంటి అంశాలతో పాటు,ఇప్పటికే భారత్‌కు సరఫరా చేస్తున్న ఎస్-400 క్షిపణి వ్యవస్థల పెంపు, అలాగే రష్యా తయారీ ఎస్‌యూ-57 యుద్ధ విమానాల కొనుగోలు గురించి చర్చలు జరగే అవకాశముందని సమాచారం. మాస్కో అధికారులతో ఈ కీలక అంశాలపై ఆయన సమావేశం కానున్నారు.ఇదిలా ఉండగా,విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా ఈ నెల చివర్లో రష్యా పర్యటనకు సిద్ధమవుతున్నారు. రక్షణ,ఇంధన,వాణిజ్య రంగాల్లో ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఆయన పర్యటన ముఖ్య ఉద్దేశంగా ఉన్నట్లు తెలిసింది. ఆయన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌తో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ భేటీలో ద్వైపాక్షిక సంబంధాలతో పాటు, అంతర్జాతీయ సమస్యలపై కూడా చర్చించనున్నారని తెలుస్తోంది.