
Indian Army: ట్రంప్ వ్యాఖ్యలపై కౌంటర్.. 1971 వార్త క్లిప్‌ను షేర్ చేసిన భారత ఆర్మీ!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై ఆరోపణలు చేస్తూ, రష్యా చమురును కొనుగోలు చేసి లాభాలు సాధిస్తున్నదని విమర్శించగా... భారత సైన్యం ఆసక్తికరంగా 1971 సంవత్సరం నాటి పాత వార్తాపత్రిక క్లిప్‌ను షేర్ చేసింది. మంగళవారం ఉదయం ఈస్ట్ కమాండ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అధికారికంగా X లో ఈ క్లిప్‌ను షేర్ చేస్తూ, "ఈ రోజే ఆ సంవత్సరం.. యుద్ధానికి ముందు పరిస్థితులు: ఆగస్టు 5, 1971" అనే క్యాప్షన్‌తో పోస్టు చేసింది. ఇందులో #KnowFacts అనే హ్యాష్‌ట్యాగ్ కూడా వాడారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఈస్ట్ కమాండ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ చేసిన ట్వీట్
#IndianArmy#EasternCommand#VijayVarsh #LiberationOfBangladesh #MediaHighlights
— EasternCommand_IA (@easterncomd) August 5, 2025
"This Day That Year" Build Up of War - 05 Aug 1971 #KnowFacts.
"𝑼.𝑺 𝑨𝑹𝑴𝑺 𝑾𝑶𝑹𝑻𝑯 $2 𝑩𝑰𝑳𝑳𝑰𝑶𝑵 𝑺𝑯𝑰𝑷𝑷𝑬𝑫 𝑻𝑶 𝑷𝑨𝑲𝑰𝑺𝑻𝑨𝑵 𝑺𝑰𝑵𝑪𝑬 '54"@adgpi@SpokespersonMoD… pic.twitter.com/wO9jiLlLQf
వివరాలు
1971 యుద్ధానికి ముందు రాజ్యసభలో చర్చకి సంబంధించినవార్త పత్రిక
"1954 నుండి ఇప్పటివరకు పాకిస్థాన్‌కు పంపిన అమెరికన్ ఆయుధాల విలువ రెండు బిలియన్ డాలర్లు" అని ఆ పాత వార్తా క్లిప్‌లో మనకి కనిపిస్తుంది. అంటే, అమెరికా దశాబ్దాలుగా పాకిస్థాన్‌కు ఆయుధ సహాయాన్ని అందిస్తోందని ఆ వార్తలో ఉంది. ఇది భారత్, పాకిస్థాన్‌ల మధ్య 1971 యుద్ధానికి ముందు రాజ్యసభలో చర్చకి సంబంధించినదని తెలుస్తోంది. ఈ పరిణామం,ట్రంప్ తాజా ఆరోపణల నేపథ్యంలో జరిగింది. ట్రంప్ సోమవారం తన సోషల్ మీడియా పోస్ట్‌లో, "భారత్ భారీగా రష్యా చమురు కొనుగోలు చేస్తోంది.ఆ చమురును మళ్లీ ఓపెన్ మార్కెట్‌లో అమ్మేసి భారీ లాభాలు సంపాదిస్తోంది.ఉక్రెయిన్‌లో ఎంత మంది చనిపోతున్నారన్నది వాళ్లకు పట్టదు"అంటూ మండిపడ్డారు. దీనితో పాటు,భారత్ నుండి అమెరికాకు దిగుమతులపై టారిఫ్‌లను భారీగా పెంచుతానని హెచ్చరించారు.
వివరాలు
భారత్ దిగుమతులపై 25 శాతం టారిఫ్‌లు,పెనాలిటీ
ఇంతకుముందు కూడా ట్రంప్, భారత్ దిగుమతులపై 25 శాతం టారిఫ్‌లు,అలాగే రష్యా నుండి మిలిటరీ సామాగ్రి, చమురు కొనుగోలుపై పెనాలిటీ విధిస్తానని ప్రకటించారు. అయితే అధికారిక నోటిఫికేషన్‌లో మాత్రం దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. ఇక భారత్ కూడా దీన్ని అదే స్థాయిలో ధీటుగా జవాబిచ్చింది. సోమవారం కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ ఒక ప్రకటన విడుదల చేస్తూ, "భారత్‌పై అమెరికా, యూరోపియన్ యూనియన్‌లు అన్యాయంగా ఆరోపణలు చేస్తూ ద్వంద్వ ధోరణి అవలంబిస్తున్నాయి" అని తీవ్రంగా స్పందించింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలైన తర్వాతే యూరప్‌కు చమురు సరఫరా ఎక్కువవ్వడంతో, భారత్‌కి రష్యా నుండి చమురు కొనుగోలు తప్పని చర్యగా మారిందని వెల్లడించింది.
వివరాలు
దేశీయ వినియోగదారులకు చవక ధరలో ఇంధనం అందించడానికే..
"భారత్ చమురు దిగుమతులు చేసే ఉద్దేశం.. దేశీయ వినియోగదారులకు స్థిరమైన, చవక ధరలో ఇంధనం అందించడానికే. ఇది దేశ అవసరాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయం. కానీ భారత్‌ను విమర్శిస్తున్న అమెరికా, యూరోపియన్ దేశాలే రష్యాతో తమ వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తుండటం దురాశ్చర్యమైన విషయం" అని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.