
Jagan-Pawan Kalyan-Andhra Pradesh: జగన్ మళ్లీ జైలుకెళ్లడం ఖాయం
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోదీ (Narendra Modi)ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం తో మాట్లాడి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)ముఖ్యమంత్రి (Chief Minister)వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y.S.Jagan Mohan Reddy)ఎక్కడ కోరుకుంటే అక్కడ ప్రధాని నరేంద్రమోదీ తో చెప్పి అక్కడ జైలు కట్టిస్తామని జనసేన (Janasena Party) వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పేర్కొన్నారు.
అందరికీ నీతులు చెప్పే వైఎస్ జగన్ గత ఐదేళ్లుగా బెయిల్ పై బయట తిరుగుతున్నారని విమర్శించారు.
రాజానగరలో శనివారం నిర్వహించిన వారాహి విజయభేరి సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
అవినీతి పరులని వదలబోమని రాజస్థాన్ ఎన్నికల సభలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన సాక్షిగా ఈ ఏడాది జగన్ మళ్లీ జైలు కెళ్లడం ఖాయమని చెప్పారు.
Pawan Kalyan Fire on Jagan
ఏపీలో కూటమిదే విజయం...: పవన్ కళ్యాణ్
జనసేనకు బలం పెరిగినా రాష్ట్రం నాశనం కాకుడదనే ఉద్దేశంతోనే కూటమి ఏర్పాటు చేశామని, వచ్చే ఎన్నికల్లో తమ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్డీయే ప్రభుత్వమొస్తే క్రైస్తవులకు కష్టకాలం దాపురిస్తుందని జగన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ అండగా ఉండగా క్రైస్తవులపై ఈగ కూడా వాలనివ్వనని హామీ ఇచ్చారు.
జగన్ జెరూసలేం ఎప్పుడెళ్లాడో తెలియదని, తాను మాత్రం జగన్ కంటే ముందే జీసస్ నడయాడిన ప్రాంతాన్ని సందర్శించుకుని వచ్చానని చెప్పారు.
తన భార్య కూడా రష్యన్ క్రిస్టియన్ అని, ఆమె ఇంట్లో క్రిస్టియన్ ఆర్థోడాక్స్ విధానాలను పాటిస్తారని, పిల్లలు ఏ మతం ఎంచుకున్నా తనకే అభ్యంతరం లేదని ఆమెతో చెప్పానని వెల్లడించారు.
Varahi Vijayayatra Sabha
పోలవరం బాధ్యత కేంద్రం తీసుకుంటుంది: పవన్ కళ్యాణ్
కేంద్రంలో మళ్లీ ఎన్డీయే ప్రభుత్వం కొలువైతే పోలవరం పూర్తి చేసే బాధ్యతను తీసుకుంటుందని చెప్పారు.
గంగానది ప్రక్షాళన మాదిరిగానే గోదావరి ప్రక్షాళనకు నడుం బిగించాలని మోదీని కోరతామని తెలిపారు.
రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పురందేశ్వరీని(Purandeswary), రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ(Bathula Bala Rama Krishna)గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పవన్ కళ్యాణ్ కోరారు.
సినిమా టికెట్ల అంశంపై జగన్ తో మాట్లాడేందుకు వెళ్ళిన సినిమా హీరోలను గేటు దగ్గర నుంచే నడిపించారని, వారికి మధ్యాహ్నం కనీసం అన్నం కూడా పెట్టకుండా ఆనందం పొందిన వ్యక్తి జగన్ అని మండిపడ్డారు.
అజాత శత్రువుగా ఉండే చిరంజీవి (Chiranjeevi)ని సైతం ఘోరంగా అవమానించిన శాడిస్టిక్ వ్యక్తిత్వం జగన్ ది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.