Supreme Court: దేవినేని అవినాష్,జోగి రమేశ్, మరో 20 మందికి ముందస్తు బెయిల్ మంజూరు
ఈ వార్తాకథనం ఏంటి
చంద్రబాబు నాయుడు నివాసం, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించిన విచారణ సుప్రీంకోర్టులో జరిగింది.
వైసీపీ నేతలు జోగి రమేశ్, దేవినేని అవినాష్ సహా 20 మంది దాఖలు చేసిన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ పూర్తిచేసి, వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
విచారణ సందర్భంగా,ప్రభుత్వం తరఫున న్యాయవాది తమ వాదనలు వినిపించారు.
వివరాలు
ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు
"నిందితులు గత మూడేళ్లుగా బెయిల్ లేదా ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించలేదు. ప్రభుత్వం మారిన తర్వాత మాత్రమే వారు కోర్టును ఆశ్రయించారు.నిందితులు తాము చేసిన తప్పును తెలుసుకున్నారు.ప్రభుత్వం మారిన తర్వాత తమ తప్పు బయటపడుతుందనే భయంతో కోర్టును ఆశ్రయించారు. మాజీ ముఖ్యమంత్రి నివాసంపై, ఆయనకు జడ్ ప్లస్ భద్రత ఉన్నా దాడి చేశారు. అంతేకాకుండా, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. తెదేపా కార్యాలయంపై జరిగిన దాడిలో దేవినేని అవినాష్ ప్రధాన సూత్రధారి. అతడు దర్యాప్తుకు పూర్తిగా సహకరించడం లేదు" అని కోర్టుకు తెలిపారు.
వివరాలు
దర్యాప్తుకు సహకరించాలి
ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. "మూడేళ్లుగా దర్యాప్తు చేపట్టకుండా తాత్సారం చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌ను పూర్తిగా ఉల్లంఘించారు.హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిందితులు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులో జోక్యం చేసుకునేలా ఎలాంటి స్పష్టమైన కారణాలు కనిపించలేదు. జోగి రమేశ్, దేవినేని అవినాష్ దేశం విడిచి వెళ్లకూడదు. వీరు తప్పనిసరిగా దర్యాప్తుకు సహకరించాలి" అని సుప్రీంకోర్టు ఆదేశించింది.