LOADING...
KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 06, 2025
05:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రూ.25వేల కోట్ల అవినీతి కార్యక్రమాలకు పాల్పడిందని గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్) కి సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈవివాదాస్పద ఆయనపై నమోదైన కేసులో ఈపరిణామం చోటుచేసుకుంది. కేటీఆర్ చేసిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి నాయకురాలు ఆత్రం సుగుణ తీవ్రంగా తప్పుబట్టారు. ఆయా వ్యాఖ్యలను అభియోగాలుగా పేర్కొంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్‌పై కేసు నమోదు చేశారు. అయితే తనపై నమోదైన కేసు కొట్టేయాలని,కేటీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.హైకోర్టు ఈ వ్యవహారంలో ఆయనకు అనుకూలంగా తీర్పు ప్రకటించింది.

వివరాలు 

ప్రతివాదిగా ఉన్న కేటీఆర్‌కు సుప్రీం నోటీసులు జారీ

కానీ హైకోర్టు తీర్పుతో అసంతృప్తికి గురైన ఆత్రం సుగుణ, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె వాదనలు పరిశీలించిన జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారణకు స్వీకరించింది. పిటిషనర్ వాదనలు విన్నఅనంతరం, ప్రతివాదిగా ఉన్న కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల వ్యవధిలోగా తన స్పందనను తెలియజేయవల్సిందిగా ఆదేశిస్తూ, తదుపరి విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.