Lok Sabha elections 2024: 642 మిలియన్ల మంది ఓటేశారు.. ప్రపంచ రికార్డు సృష్టించామన్న EC
ఈ వార్తాకథనం ఏంటి
భారత ఎన్నికల సంఘం(ECI)సోమవారం లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించింది.
అనేక చారిత్రక మైలురాళ్లను హైలైట్ చేస్తూ,642 మిలియన్ల నమోదిత ఓటర్లతో భారతదేశం ప్రపంచ రికార్డును నెలకొల్పినట్లు EC ప్రకటించింది.
ఈఎన్నికల్లో 31.2 కోట్ల మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC)రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు.
ఈ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటు వేయడంతో మనం ప్రపంచ రికార్డు సృష్టించినట్లు వెల్లడించారు.
అన్ని G7 దేశాల ఓటర్ల కంటే 1.5 రెట్లు ఎక్కువ. EU సమాఖ్యలోని 27 దేశాల ఓటర్లు 2.5 రెట్లు కంటే ఎక్కువ కావడం విశేషం.
Details
ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదు
2019 ఎన్నికలలో 540తో పోలిస్తే 2024 లోక్‌సభ ఎన్నికల్లో రీపోలింగ్ జరిగినట్లు ఎన్నికల కమిషనర్ తెలిపారు.
రాజివ్ కుమార్ మాట్లాడుతూ.. 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రీపోలింగ్ అవసరం రాలేదన్నారు.
గత ఎన్నికల్లో 540 చోట్ల రీపోలింగ్ నిర్వహించగా.. ఈసారి ఆ సంఖ్య 39కు తగ్గిందన్నారు. ఇందులో కేవలం రెండు రాష్ట్రాల్లోనే 25 చోట్ల రీపోలింగ్ జరిగిందన్నారు.
ఈ లోక్‌సభ ఎన్నికల్లో గత నాలుగు దశాబ్దాల్లో జమ్ముకశ్మీర్‌లో అత్యధికంగా ఓటింగ్ నమోదైందని రాజీవ్ కుమార్ చెప్పారు.
ఈ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదని ఆయన పేర్కొన్నారు. మొత్తం అక్కడ 58.58శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కశ్మీర్ లోయలో 51.05శాతం పోలింగ్ నమోదైందన్నారు.
Details
99.9శాతం ఫిర్యాదుల పరిష్కారం
ఎన్నికల్లో నగదు ప్రవాహాన్ని విజయవంతంగా అడ్డుకున్నాం. రూ.10వేల కోట్ల విలువైన నగదు, కానుకలు, డ్రగ్స్, మద్యాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నాయన్నారు.
2019లో ఈ సంఖ్య రూ.3,500కోట్లుగా ఉందని తెలిపారు. ఈసారి ఎన్నికల సమయంలో సీ-విజిల్ యాప్‌లో 4.56 లక్షల ఫిర్యాదులు రాగా.. . వీటిల్లో 99.9శాతం ఫిర్యాదులను పరిష్కరించామని .. అలాగే ఇందులో 87.5శాతం వాటికి 100 నిమిషాల్లోపే పరిష్కారం చూపామని తెలిపారు.
డీప్‌ఫేక్ వీడియోలను కూడ నిలువరించినట్లు తెలిపారు. రేపు(జూన్ 4)న జరిగే ఓట్ల లెక్కింపుపై స్పందించిన ఈసీ . కౌంటింగ్ ప్రక్రియ చాలా పటిష్ఠంగా జరగనున్నట్లు తెలిపారు.