Page Loader
Parliament Monsoon Session: పార్లమెంట్‌లోని ప్రధాని ఆఫీసులో ఉన్నత స్థాయి సమావేశం.. హాజరైనా అమిత్ షా,నడ్డా 
పార్లమెంట్‌లోని ప్రధాని ఆఫీసులో ఉన్నత స్థాయి సమావేశం.. హాజరైనా అమిత్ షా,నడ్డా

Parliament Monsoon Session: పార్లమెంట్‌లోని ప్రధాని ఆఫీసులో ఉన్నత స్థాయి సమావేశం.. హాజరైనా అమిత్ షా,నడ్డా 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 21, 2025
04:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో కీలక సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah), రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh),బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman), శివరాజ్ సింగ్ చౌహాన్, కిరణ్ రిజిజులు హాజరయ్యారు. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహం,చర్చించాల్సిన ముఖ్య అంశాలపై ఈ సమావేశంలో ప్రధానమంత్రి సహా మంత్రులు సమాలోచనలు జరుపుతున్నారు. ఇక వచ్చే వారం 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor)పై పార్లమెంట్‌లో చర్చ జరగనుండటంతో.. దాని గురించి కూడా ప్రధాని, మంత్రులు ఈ సమావేశంలో చర్చించి తుది వ్యూహాన్ని రూపొందించనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పార్లమెంటులో ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం