Page Loader
PM Modi: నేడు జమ్ముకశ్మీర్‌లో మోదీ పర్యటన.. చీనాబ్ వంతెన ప్రారంభించనున్న ప్రధాని
నేడు జమ్ముకశ్మీర్‌లో మోదీ పర్యటన.. చీనాబ్ వంతెన ప్రారంభించనున్న ప్రధాని

PM Modi: నేడు జమ్ముకశ్మీర్‌లో మోదీ పర్యటన.. చీనాబ్ వంతెన ప్రారంభించనున్న ప్రధాని

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 06, 2025
09:09 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం జమ్ముకశ్మీర్‌ పర్యటనకు వెళ్ళనున్నారు. ఇటీవల జరిగిన 'ఆపరేషన్ సిందూర్' అనంతరం ఆయన రాష్ట్రాన్ని సందర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా మోదీ,ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెనను అధికారికంగా ప్రారంభించనున్నారు. అంతేగాక, రూ.46,000 కోట్ల విలువగల పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. చీనాబ్ రైల్వే వంతెన విశేషాలు ఇది ప్రపంచంలోని ఎత్తైన రైల్వే వంతెనగా గుర్తింపు పొందింది.దీని ఎత్తు,ఐఫెల్ టవర్ కంటే ఎత్తుగా ఉంటుంది. మొత్తం 1,315 మీటర్ల పొడవుతో ఈ వంతెన నిర్మించబడింది. క్లిష్టమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా దీనిని అభివృద్ధి చేశారు. జమ్మూకాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో ఈ వంతెనను నిర్మించారు.ఇది శ్రీనగర్ రైల్వే లైన్‌పై ఇంజనీరింగ్ విభాగం అద్భుతంగా నిర్మించింది.

వివరాలు 

చీనాబ్ వంతెన నిర్మాణానికి సుమారుగా 30,000 టన్నుల ఉక్కు

ఈ వంతెన, గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంది. భూకంపాల పరంగా అత్యంత ప్రమాదకరమైన జోన్‌-5కు చెందిన ప్రాంతంలో దీనిని నిర్మించారు. ఈ నిర్మాణం మాతా వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే భక్తులకు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకుగానూ ప్రత్యేకంగా రూపొందించబడింది. మోదీ ప్రారంభించబోయే ఇతర ముఖ్య ప్రాజెక్టుల్లో 272 కిలోమీటర్ల ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టు కూడా ఉంది. ఈ చీనాబ్ వంతెన నిర్మాణానికి సుమారుగా 30,000 టన్నుల ఉక్కు వినియోగించారు. ఇది ప్రస్తుతం ప్రపంచంలోని ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనగా నిలిచింది. ఈ వంతెన నిర్మాణం 2002లో ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు మార్గ అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ప్రారంభమైంది.

వివరాలు 

ఉగ్రవాదంపై పోరాటం.. ప్రధాని కీలక ప్రకటన

వంతెన ప్రారంభోత్సవానికి తోడు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు. అంతేకాక, ఉగ్రవాదంపై పోరాటం విషయంలోనూ ప్రధాని ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో భద్రతా దళాలు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జితేంద్ర సింగ్ చేసిన ట్వీట్