Page Loader
Mamata Banerjee: బెంగాల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు.. టీఎంసీ ఒంటరిగా పోటీ చేస్తుంది.. తేల్చేసిన మమత 
బెంగాల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు

Mamata Banerjee: బెంగాల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు.. టీఎంసీ ఒంటరిగా పోటీ చేస్తుంది.. తేల్చేసిన మమత 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 11, 2025
09:34 am

ఈ వార్తాకథనం ఏంటి

2026లో పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ, సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని ఆ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టంగా ప్రకటించారు. పార్టీ ఎమ్మెల్యేలకు ఉద్దేశించి మమతా బెనర్జీ ప్రసంగిస్తూ, బెంగాల్‌లో కాంగ్రెస్‌కు ఎటువంటి స్థానం లేదని, తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగానే పోటీకి దిగుతుందని తేల్చిచెప్పారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ సహాయం చేయలేదని, అదే విధంగా హర్యానాలో కాంగ్రెస్‌కు ఆప్ మద్దతు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో పరస్పర సహకారం లేకపోవడం వల్లే బీజేపీ విజయం సాధించిందని ఆమె అభిప్రాయపడ్డారు.

వివరాలు 

నాలుగోసారి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది: మమతా 

మమతా బెనర్జీ తాను 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని, సంకీర్ణ ప్రభుత్వానికి అవకాశమే లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ మూడింట రెండు వంతుల మెజారిటీతో గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వరుసగా నాలుగోసారి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాగా చెప్పారు. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కోవడం ఇండియా కూటమికి సవాలుగా మారిందని, అయితే పార్టీ ఎమ్మెల్యేలు అప్రమత్తంగా ఉండాలని మమతా సూచించారు.