LOADING...
Heavy Rain Alert : బంగాళాఖాతంలో మరో మూడు అల్పపీడనాలు.. తెలుగు రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు 
బంగాళాఖాతంలో మరో మూడు అల్పపీడనాలు.. తెలుగు రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు

Heavy Rain Alert : బంగాళాఖాతంలో మరో మూడు అల్పపీడనాలు.. తెలుగు రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 29, 2025
02:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి బంగాళాఖాతానికి దగ్గరగా ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తీరాన్ని దాటిన తర్వాత, మరింత లోతుగా ముందుకు కదిలింది. ప్రస్తుతానికి ఈ అల్పపీడనం మధ్య ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో కొనసాగుతోంది. మరోవైపు, తూర్పు-ఆగ్నేయ దిశలో మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ప్రభావం కొనసాగుతోంది. ఈ పరిస్థితుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధ,గురువారం రోజుల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షాలు నమోదయ్యాయి. బుధవారం ఉదయం నుండి గురువారం ఉదయం 8 గంటల వరకు,రాష్ట్రంలో సగటున 5.08 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గురువారం రాత్రి 2.5 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, నిర్మల్ వంటి జిల్లాలు భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి.

హెచ్చరిక

వాతావరణ శాఖ హెచ్చరికలు 

మరో రెండు రోజులు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. అదనంగా, వాతావరణ శాఖ అధికారులు బంగాళాఖాతంలో త్వరలో మూడు కొత్త అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని ప్రకటించారు. రానున్న రెండు మూడు రోజుల్లో ఈ ప్రాంతంలో మరో అల్పపీడనం ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. సెప్టెంబర్ 2 నాటికి అల్పపీడనం ప్రభావంపై స్పష్టత వస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఉన్నతాధికారి నాగరత్న తెలిపారు.

వివరాలు 

 ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 

కామారెడ్డి జిల్లాలో మినీ క్లౌడ్ బరస్ట్ కారణంగా కుండపోత వర్షం కురిసింది. గత 10 రోజులుగా మేఘాలు కేంద్రీకృతమై ఉండడం వల్ల, రాబోయే రెండు రోజులలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.