Modi Congratulates Team India: ప్రపంచ కప్ లో ఫైనల్ కి చేరిన టీమిండియాకు ప్రధాని అభినందనలు
ఐసీసీ వరల్డ్ కప్ సెమిఫైనల్ న్యూజిలాండ్ పై (IND Vs NZ) టీమిండియా విక్టరీతో దేశవ్యాప్తంగా అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. కీలకమైన మ్యాచ్ లో రాణించిన టీమిండియా (Team India) ఆటగాళ్లను అభినందనల్లో ముంచెత్తుతున్నారు. క్రికెట్ లవర్స్ తో పాటూ సినీ, రాజకీయ ప్రముఖులు టీమిండియాను పొగుడుతూ పోస్టులు చేస్తున్నారు. అయితే కివీస్ పై భారత్ విజయంతో ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ లో (Modi Tweet) పోస్టు చేశారు. ముంబైలో టీమిండియా న్యూజిలాండ్ పై అద్భుతంగా ఆడిందని కొనియాడారు. ఈ సందర్భంగా 7 వికెట్లు తీసిన షమీ క్రికెట్ ప్రేమికులు ఎప్పటికి గుర్తుంచుకుంటారన్నారు. అహ్మదాబాద్ లో జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియాకు బెస్ట్ విషెస్ చెప్పారు ప్రధాని మోదీ.