Page Loader
Narendra Modi: అమెరికాలో కొత్త భారతీయ రాయబార కార్యాలయాలు.. బోస్టన్, లాస్ ఏంజెల్స్‌లో ప్రారంభం
అమెరికాలో కొత్త భారతీయ రాయబార కార్యాలయాలు.. బోస్టన్, లాస్ ఏంజెల్స్‌లో ప్రారంభం

Narendra Modi: అమెరికాలో కొత్త భారతీయ రాయబార కార్యాలయాలు.. బోస్టన్, లాస్ ఏంజెల్స్‌లో ప్రారంభం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 23, 2024
09:54 am

ఈ వార్తాకథనం ఏంటి

న్యూయార్క్‌లోని నాస్సు వెటరన్స్ కొలిసియమ్‌లో భారతీయ అమెరికన్ల సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. బోస్టన్, లాస్ ఏంజెల్స్ నగరాల్లో కొత్త భారతీయ రాయబార కార్యాలయాలను (ఇండియన్ కాన్సులేట్స్) త్వరలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ రెండు నగరాల్లో రాయబార కార్యాలయాల కోసం గత కొంత కాలంగా ఉన్న డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో మోదీ ఈ ప్రకటన చేశారు. విద్యా, ఫార్మాస్యూటికల్స్ రంగాలకు బోస్టన్ కేంద్రం కాగా, లాస్ ఏంజెల్స్ ప్రపంచప్రసిద్ధ హాలీవుడ్ పరిశ్రమకు నిలయం. అలాగే, లాస్ ఏంజెల్స్ 2028 ఒలింపిక్స్‌ క్రీడలకు వేదికగా ఉండనుంది. ఇది ఈ నగర ప్రాధాన్యతను మరింత పెంచుతోంది.

Details

అమెరికాలో భారతీయ సమాజానికి మరింత సేవలు

లాస్ ఏంజెల్స్ అత్యంత పొడవైన తీరప్రాంతం కలిగిన నగరం కావడంతో పాటు అమెరికా సముద్ర వాణిజ్యంలో 40 శాతం ఈ నగర ద్వారానే జరుగుతోంది. ప్రస్తుతం అమెరికా న్యూయార్క్‌లోని భారత శాశ్వత రాయబార కార్యాలయం, అట్లాంట, చికాగో, హ్యూస్టన్, శాన్‌ఫ్రాన్సిస్కో, సీటెల్‌లలో భారత రాయబార కార్యాలయాలు పని చేస్తున్నాయి. లాస్ ఏంజెల్స్, బోస్టన్ లాంటి కీలక నగరాల్లో కొత్త కార్యాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా అమెరికాలో భారతీయ సమాజానికి మరింత సేవలు అందించే దిశగా ముందడుగు పడనుంది. గతేడాది సీటెల్‌లో రాయబార కార్యాలయం ఏర్పాటు చేయడంపై వ్యాఖ్యానించారు. ఇప్పుడు బోస్టన్, లాస్ ఏంజెల్స్‌లో కూడా కొత్త కార్యాలయాలను ప్రారంభిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు.