LOADING...
Chirag Paswan: ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి అవుతారు: చిరాగ్ పాశ్వాన్
ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి అవుతారు: చిరాగ్ పాశ్వాన్

Chirag Paswan: ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి అవుతారు: చిరాగ్ పాశ్వాన్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 29, 2025
09:46 am

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర మంత్రి,లోక్‌ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ తాజాగా తన వైఖరిని మార్చుకున్నారు. రెండు రోజుల క్రితం బిహార్‌లో నేరాలు ఎక్కువైపోయాయని, శాంతి భద్రతల పరిస్థితి దిగజారిందని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన ఆయన,ఇప్పుడు మాత్రం భిన్నంగా స్పందించారు. మళ్లీ నితీశ్ కుమారే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని స్పష్టంగా చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి గెలుపొందుతుందని ధీమాగా చెప్పారు.

వివరాలు 

రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి: చిరాగ్ పాశ్వాన్

"ఇది విజయం సాధించే కలయిక. ఎన్నిసార్లైనా చెబుతా.. ఎన్నికలు మోదీగారి నాయకత్వంలోనే జరుగుతాయి. ఫలితాల అనంతరం నితీశ్ కుమారే మరోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయన తప్పక ముఖ్యమంత్రి అవుతారు," అని చిరాగ్ పాశ్వాన్ ప్రకటించారు. అలాగే, "ఆపరేషన్ సిందూర్" అంశంపై ప్రధానిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న విపక్ష పార్టీలపై చిరాగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ఇందుకు కేవలం రెండు రోజులు ముందే .. జూలై 26న పాట్నాలో జరిగిన మీడియా సమావేశంలో.. అయన సీఎం నితీశ్‌ ప్రభుత్వం నిప్పులు చెరిగారు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. నేరాలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినందుకు తనకు చాలా బాధగా ఉందన్నారు.

వివరాలు 

రాష్ట్రంలో నేరాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలి: చిరాగ్ పాశ్వాన్

రాష్ట్రంలో హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు, కిడ్నాప్‌లు వంటి ఘోర నేరాలు రోజురోజుకీ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు భయభ్రాంతుల మధ్య జీవిస్తున్నారని, ప్రభుత్వ యంత్రాంగం వారిని రక్షించగలిగే స్థితిలో లేదన్నారు. అలాంటి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన విషయాన్ని తాను తప్పుగా భావిస్తున్నానని చెప్పారు. ఇప్పటికైనా పాలక వ్యవస్థ మేల్కొని రాష్ట్రంలో నేరాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పాశ్వాన్ హితవు పలికారు.