
Pakistan:పాకిస్థాన్ ఐఎస్‌ఐ.. జ్యోతి మల్హోత్రాను ఓ అస్త్రంగా మలుచుకున్నారు: హర్యానా పోలీసులు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌కు గూఢచారిగా వ్యవహరించిందనే ఆరోపణలపై హర్యానాకు చెందిన యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఆమెను విచారిస్తున్న క్రమంలో అధికారులకి కీలకమైన సమాచారం లభించిందని తెలుస్తోంది.
హరియాణా పోలీసుల ప్రకారం, పాకిస్థాన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్‌ఐ (ISI) ఏజెంట్లు మల్హోత్రాను ఓ అస్త్రంలా ఉపయోగించారని వారు తేల్చారు.
ఇటీవల జరిగిన 'ఆపరేషన్ సిందూర్'లో భాగంగా, ఢిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో పనిచేసే ఓ అధికారితో ఆమె నేరుగా సంబంధంలో ఉన్నట్టు నిర్ధారించారు.
వివరాలు
ఇన్‌ఫ్లుయెన్సర్లను అస్త్రంగా మలచుకొని..
హిసార్ ఎస్‌పీ శశాంక్ కుమార్ సావర్ మాట్లాడుతూ.. "జ్యోతి మల్హోత్రా సైనిక విషయాలు లేదా రక్షణ సంబంధిత సమాచారం పాక్ ఏజెంట్లకు అందించిందని ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేం. అయితే, పాక్‌కు చెందిన నిఘా వ్యవస్థలతో, ముఖ్యంగా PIOలతో ఆమె నేరుగా సంబంధాలు కలిగి ఉంది. వారు ఆమెను తమ లక్ష్యాల కోసం ఒక అస్త్రంలా ఉపయోగిస్తున్నారు. అంతేకాదు, ఇతర యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్లతోనూ ఆమె నిఘా వర్గాల తరపున టచ్‌లో ఉంది. వాళ్లూ పీఐవోలతో మాట్లాడుతున్నారన్న ఆధారాలు ఉన్నాయ" అన్నారు.
ఇలాంటి పరిస్థితులు కూడా ఓ రకమైన మౌన యుద్ధంగా భావించాలన్నారు.
ఇన్‌ఫ్లుయెన్సర్లను నియమించుకుని, వారిని ఉపయోగించి విదేశీ శక్తులు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నాయని చెప్పారు.
వివరాలు
పాక్‌కు పలుసార్లు - చైనాకు కూడా వెళ్లిన ఆధారాలు
జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్‌కు పలు మార్లు వెళ్లినట్టు, ఒకసారి చైనా ప్రయాణం కూడా చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.
గతంలో భారత్ బహిష్కరించిన ఓ పాక్ అధికారితో ఆమె నేరుగా సంబంధాలు పెట్టుకున్నట్టు సమాచారం లభించిందన్నారు.
ఆమె ఆర్థిక లావాదేవీలు, విదేశీ ప్రయాణాల వివరాలను విచారిస్తున్నామని, ఆమె ఎవరికెవరిని కలిసింది? ఎక్కడెక్కడకు వెళ్లింది? అనే అంశాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు.
అలాగే ఆమె ల్యాప్‌టాప్‌తోపాటు ఇతర డిజిటల్ పరికరాలపై ఫోరెన్సిక్ పరిశీలన జరపనున్నామని, ఆ ప్రక్రియలో ఆమె పంచుకున్న సమాచారం ఏమిటన్నదీ బయటపడుతుందని చెప్పారు.
ఈ కేసు విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలతో కూడా సంబంధాలను కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు.