
Jammu: జమ్మూ,పంజాబ్,రాజస్థాన్‌లలో పాకిస్తాన్ డ్రోన్ దాడులు.. F-16 విమానాలను కూల్చేసిన భారత్
ఈ వార్తాకథనం ఏంటి
జమ్మూ ప్రాంతంలో ఈరోజు పాకిస్థాన్ భారత్‌పై దాడికి పాల్పడింది. జమ్మూ విమానాశ్రయం సమీపంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.
విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
ఈ ఘటన అనంతరం ఎమర్జెన్సీగా ఎయిర్ సైరన్లు మోగించబడ్డాయి. జమ్మూ నగరమంతటా విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
ప్రజలంతా తమ ఇళ్లలోనే ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
నగరంలోని పలు ప్రాంతాల్లో బ్లాక్‌అవుట్ అమలు చేశారు. మొత్తం మీద 5 నుండి 6 పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.
అంతేగాక, పాకిస్తాన్‌కు చెందిన డ్రోన్లు భారత సరిహద్దుల్లోకి చొరబడుతున్న దృశ్యాలు కనిపించాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జమ్ముకశ్మీర్‌లో మోగిన సైరన్లు
#WATCH | J&K | A complete blackout has been enforced in Kishtwar of Jammu Division, and sirens are being heard throughout the district. pic.twitter.com/1tBwxjoxR7
— ANI (@ANI) May 8, 2025
వివరాలు
సిద్ధంగా ఉన్న ఎస్-400 క్షిపణి వ్యవస్థలు
పాకిస్థాన్ దాడుల నేపథ్యంలో భారత దేశం ఈ రాత్రి ఎలా స్పందించబోతుందనే అంశం ఇప్పుడు ఉత్కంఠను రేపుతోంది.
పాక్‌లో ఉన్న మరిన్ని కీలక ప్రాంతాలను భారత సైన్యం, వైమానిక దళం లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది.
ఏ విధమైన దాడులైనా ఎదుర్కొనేందుకు భారత వాయుసేన ఫైటర్ జెట్లు, ఆర్మీకి చెందిన ఎస్-400 క్షిపణి వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయి.
జమ్మూ విమానాశ్రయం వద్ద భద్రతా బలగాలు పూర్తి అప్రమత్తతతో ఉన్నాయి. పాకిస్థాన్ లక్ష్యంగా ఎంచుకున్న ప్రాంతాల్లో ప్రస్తుతం సంపూర్ణ బ్లాక్ అవుట్ కొనసాగుతోంది.
వివరాలు
జమ్మూకశ్మీర్, పంజాబ్‌లలో హెచ్చరికలు జారీ
భారత్-పాకిస్తాన్ మధ్య వాతావరణం తాజాగా ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో, జైషే మహ్మద్, లష్కరే తొయ్యిబా వంటి ఉగ్రవాద సంస్థలు భద్రతా బలగాలపై ఆత్మాహుతి దాడులకు తెగబడే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించాయి.
ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు.
దీంతో ఆయా రాష్ట్రాల్లోని దేవాలయాలు, నీటి ప్రాజెక్టులు వంటి ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టంగా తీశారు.
వివరాలు
ఈ జిల్లాలో కరెంట్ బంద్
పంజాబ్‌లోని గుర్‌దాస్‌పుర్ జిల్లాలో రాత్రివేళ విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
''గుర్‌దాస్‌పుర్ జిల్లా అంతటా రాత్రి 9గంటల నుంచి ఉదయం 5గంటల వరకు విద్యుత్ పూర్తిగా నిలిపివేయాలి. అయితే ఆసుపత్రులు,కేంద్ర కారాగారాలకు మాత్రం ఈ నిబంధన నుండి మినహాయింపు ఉంది. అయినప్పటికీ, ఈ సంస్థల కిటికీలు, తలుపులు పూర్తిగా మూసివేయాలని స్పష్టంగా పేర్కొన్నారు.అత్యవసర పరిస్థితుల సమయంలో ప్రజల భద్రతకు ఇది అవసరమైందని ప్రభుత్వం తెలిపింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని వెల్లడించింది'' అని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ చర్యలు అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనడానికి ముందస్తు జాగ్రత్తల ఫలితంగా తీసుకున్నవేనని సమాచారం.
వివరాలు
F-16ను కూల్చిన భారత్
భారత వాయుసేన తన వైమానిక రక్షణ వ్యవస్థను సంసిద్ధం చేసింది. శత్రుదేశమైన పాకిస్థాన్‌కి చెందిన అనేక డ్రోన్లను భారత సైన్యం గుర్తించి ధ్వంసం చేసింది.
ఈ క్రమంలో పాకిస్థాన్‌కు చెందిన F-16 యుద్ధ విమానం భారత సరిహద్దులను దాటి లోనికి ప్రవేశించింది.
ఉద్దేశపూర్వకంగా పటాన్‌కోట్ వాయుసేన స్థావరంపై దాడి చేయాలని అది యత్నించింది.
అయితే, భారత వైమానిక దళం సకాలంలో స్పందించి ఆ విమానాన్ని కూల్చేసింది.
గతంలో మూడు సంవత్సరాల క్రితం ఇదే తరహాలో ఒక F-16ను భారత్ కూల్చిన సంగతి తెలిసిందే.
తాజాగా కూడా ఇదే రకమైన ఇంకొక విమానాన్ని భారత సైన్యం నేలమట్టం చేయడం విశేషం.
వివరాలు
దాడులు ఎక్కడ ఎక్కడ జరిగాయి?
పఠాన్‌కోట్ వైమానిక దళ స్థావరంపై పాకిస్తాన్ డ్రోన్ దాడి చేసింది. అయితే, భారత వైమానిక రక్షణ వ్యవస్థ అన్ని డ్రోన్‌లను కూల్చివేసింది.
ఉత్తర కాశ్మీర్‌లోని తంగ్‌ధర్ సెక్టార్‌లో పాకిస్తాన్ వైపు నుండి భారీ మోర్టార్ షెల్లింగ్ జరిగింది.
రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో పెద్ద పేలుడు శబ్దం వినిపించింది.
జమ్మూ విమానాశ్రయ ఆవరణను డ్రోన్ ఢీకొట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
జమ్మూ విశ్వవిద్యాలయం సమీపంలో కొన్ని డ్రోన్లను కూడా కూల్చివేసారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జైసల్మేర్‌లో పాకిస్తాన్ డ్రోన్లు ధ్వంసం
#WATCH | Pakistani drones intercepted by Indian air defence in Jaisalmer. Explosions can be heard, and flashes in the sky can be seen.
— ANI (@ANI) May 8, 2025
(Editors note: Background conversation is of ANI reporters witnessing live interception of Pakistani drones by Indian Air Defence ) pic.twitter.com/Ca1vpmNtjV
వివరాలు
రాజస్థాన్‌లోని 3 ప్రదేశాలపై పాకిస్తాన్ దాడి
ఆ నివేదిక ప్రకారం, బికనీర్‌లోని నాల్, బార్మర్‌లోని ఉత్తర్‌లై, రాజస్థాన్‌లోని ఫలోడి వైమానిక స్థావరాలపై పాకిస్తాన్ క్షిపణి దాడులు నిర్వహించింది. అయితే, భారతదేశం ఈ దాడులన్నింటినీ తటస్థీకరించింది.
పాకిస్తాన్ వైమానిక దళం ఎఫ్ -16, జెఎఫ్ -17 లతో పాటు, రాజస్థాన్ సరిహద్దులో ఇతర విమానాలను కూడా మోహరించింది.
అదే సమయంలో, భారతదేశం రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాలన్నింటినీ పూర్తిగా బ్లాక్ అవుట్ చేసింది.