Page Loader
Parliament Monsoon Session: నిరసనల మధ్య ఉభయ సభలు రేపటికి వాయిదా.. 
నిరసనల మధ్య ఉభయ సభలు రేపటికి వాయిదా..

Parliament Monsoon Session: నిరసనల మధ్య ఉభయ సభలు రేపటికి వాయిదా.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 22, 2025
02:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వరుసగా రెండో రోజు కూడా ఎలాంటి చర్చలు జరగకుండా రద్దయిపోయాయి. బిహార్‌లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఇంటెన్సివ్ రివ్యూ (ఎస్‌ఐఆర్‌) పేరుతో ఓటర్ల జాబితాను సవరించడం పై ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. లోక్‌సభలో,రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీలు ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. లోక్‌సభలో స్పీకర్‌, రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్‌ చర్చలకు అవకాశం కల్పించేందుకు ప్రయత్నించినప్పటికీ సభ్యులు వినిపించుకోలేదు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నిరసన నినాదాలు చేయడంతో సభలు గందరగోళంగా మారాయి. ఈ కారణంగా ఉభయసభలు మొదట మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అనంతరం సభలు మళ్లీ ప్రారంభమైనప్పటికీ అదే పరిస్థితి కొనసాగింది. చివరికి ఉభయసభలను రేపటికి వాయిదా వేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిరసనల మధ్య ఉభయ సభలు రేపటికి వాయిదా..