
PM Modi: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో.. పలు దేశాల పర్యటనలను రద్దు చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌లో ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం చురుకైన మెరుపుదాడులు జరిపిన విషయం తెలిసిందే.
ఈ దాడుల అనంతరం దేశంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ పలు విదేశీ పర్యటనలను రద్దు చేసిన ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ నెల మధ్యలో ప్రధాని మోదీ యూరప్‌లోని కొన్ని దేశాలకు వెళ్లాల్సి ఉంది. ఆయన క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్ సహా యూరప్ పర్యటనలో భాగంగా పలు సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంది.
కానీ, ఆపరేషన్ సిందూర్ దాడుల నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగాయి. ఈ పరిస్థితుల మధ్య మోదీ తన పర్యటనలను రద్దు చేసినట్లు సమాచారం.
వివరాలు
9 ఉగ్ర స్థావరాలపై నిర్వహించిన ఈ దాడుల్లో 80 మందికి పైగా ఉగ్రవాదులు హతం
అంతేకాదు,రష్యాలో జరిగే విక్టరీ డే ఉత్సవాల్లో మోదీ పాల్గొనడం లేదని ఇటీవలే క్రెమ్లిన్ అధికారికంగా ప్రకటించింది.
ఇది కూడా ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో తీసుకున్న నిర్ణయంగా చెప్పవచ్చు.
ఇక గత నెలలో జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు ఘోరంగా దాడి చేశారు. ఈ దాడిలో కనీసం 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ దాడికి ప్రతిగా భారత్ పాకిస్థాన్‌పై ఒత్తిడి తీసుకొచ్చేలా తీవ్ర చర్యలు ప్రారంభించింది.
ఈ క్రమంలోనే భారత సైన్యం పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై మెరుపుదాడులకు పాల్పడింది.
మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై నిర్వహించిన ఈ దాడుల్లో 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.